తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో 30 వరకు లాక్ డౌన్ పొడగించారు. అదే సమయంలో కేంద్రం ఇచ్చిన అన్ని సడలింపులు ఇచ్చారు. తెలంగాణలోకి ఎవరైనా రావచ్చు.
ఎవరైనా ఇక్కడి నుంచి పోవచ్చు. కేంద్రం ఆయా రాష్ట్రాల సరిహద్దులను తెరిచే అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి అందరికీ వెల్ కం చెప్పారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు ఆయా రాష్ట్రాల నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణలోకి ఏపీ నుంచి ఎవరైనా రావచ్చు అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఏపీ వారు ఇక్కడికి రావడానికి అనుమతి దొరికింది. మరి ఏపీలోకి రావచ్చా లేదా అన్నది ఇంకా అక్కడి ప్రభుత్వం ప్రకటించలేదు. ఇపుడు ఇచ్చిన సడలింపుల వల్ల వ్యాపారం పెద్దగా మెరుగుపడకపోవడంతో కేంద్రం ఇచ్చిన సడలింపులు అన్నీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపారు.
హైదరాబాదులో – అటు ఏపీలో అటు ఇటు ఇరుక్కుపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది పెద్ద గుడ్ న్యూస్. రాత్రి కర్ఫ్యూ విషయంలో కేసీఆర్ కేంద్రాన్నే ఫాలో అయ్యారు. 8వ తేదీ నుంచి భద్రాచలం సహా తెలంగాణ ఆలయాలన్నీ తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates