పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని డైరెక్టుగా ఎదుర్కోలేని బీజేపీ అగ్రనేతలు ఆమెపై మైండ్ గేమ్ మొదలుపెట్టేశారు. బెంగాల్లో మూడు నియోజకవర్గాలకు ఉపఎన్నికలను కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి సాధారణ ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి పోటీచేసి మమత ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో ఓపోయినా సీఎంగా మమత బాధ్యతలు తీసుకున్నారు. కాబట్టి ఆరుమాసాల్లోగా ఏదో ఒక నియోజకవర్గం నుండి గెలవాల్సిన అవసరం ఇపుడు మమతకు వచ్చింది.
ఈ నేపధ్యంలోనే మూడు నియోజకవర్గాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో భవానీపూర్ అసెంబ్లీ నుండి మమత నామినేషన్ వేశారు. ఎన్నికలో మమతను ఓడించటం కష్టమని బీజేపీకి బాగా అర్ధమైపోయింది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి సుబేందు అధికారి చేతిలో వెంట్రుకవాసిలో మమత ఓడిపోయారు. అయితే తన సుబేందు గెలుపుపై మమత కోర్టులో కేసు వేశారు. విచారణ జరుగుతోంది. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే రేపటి ఎన్నికల్లో మమతను ఓడించటం అంత ఈజీ కాదని బీజేపీ అగ్రనేతలకు కూడా తెలుసు.
అందుకనే ఎన్నికల్లో ఓడించటంకన్నా దానికన్నా ముందే ఇబ్బందులు పెట్టాలని డిసైడ్ అయిపోయారు. ఇందులో భాగంగానే మమత నామినేషన్ను తిరస్కరించాలని నానా గోల మొదలుపెట్టేశారు. ఎందుకయ్యా అంటే నామినేషన్లో తనపై ఉన్న కేసులను మమత ప్రస్తావించలేదట. ఈ కారణంతో నామినేషన్ తిరస్కరించాల్సిన అవసరమేలేదు. ఎందుకంటే క్రిమినల్ రికార్డుంటే వివరాలిమ్మని రిటర్నింగ్ అధికారి అడిగితే సరిపోతుంది.
కానీ బీజేపీ నేతలు మాత్రం ఏకంగా నామినేషన్ తిరస్కరణకే డిమాండ్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసులు సీఎం మమతాబెనర్జీ మీద కాదట ఉన్నది. మమతబెనర్జీ అనే పేరుమీద మరో మహిళున్నారట. ఆమెమీద క్రిమినల్ కేసులున్నాయంటు తృణమూల్ నేతలంటున్నారు. సదరు మహిళకు సంబంధించిన వివరాలను కూడా తృణమూల్ నేతలు మీడియా ముందుంచారు.
తృణమూల్ నేతలు ఎంత చెప్పినా బీజేపీ నేతలు మాత్రం పట్టంచుకోవటంలేదు. ముమ్మాటికి సీఎ మమతబెనర్జీ మీదే క్రిమినల్ కేసులున్నాయంటూ పదే పదే ప్రచారం చేస్తున్నారు. సరే క్రిమినల్ కేసుల సంగతి ఎలాగున్నా మమతను మానసికంగా దెబ్బతీయాలన్నదే అసలైన ఉద్దేశ్యంగా అర్ధమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో మమత చేతిలో దారుణంగా దెబ్బతిన్న తర్వాత ఎలాగైనా దీదీని దెబ్బ కొట్టడమే బీజేపీ టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిపోతోంది. మరి తాజా వివాదంపై కేంద్ర ఎన్నికల కమీషన్ ఏమంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates