ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా రజనీష్ కుమార్ ను నియమించారు. రాష్ట్ర ఆర్థిక పరస్థితి రోజు రోజుకీ దిగజారం.. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలవ్వడం రక రకాల కారణాల నేపథ్యంలో ప్రభుత్వం రజనీష్ కుమార్ ను నియమించింది.
అసలు ఎవరీ రజనీష్ కుమార్.. ఆయననే ఎందుకు నియమించారో ఇప్పుడు చూద్దాం..ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకు స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 40 సంవత్సరాలు పైగా పనిచేసి, ఆ తరువాత చైర్మన్ గా 2020 అక్టోబర్ లో పదవీ విరమణ చేశారు.
ఎస్ బీఐ లో ఏడు బ్యాంకులను విలీనం చేయడంలో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. ఎస్ బీఐ యోనో ప్లాట్ ఫాం ను రూపొందించడంలో రజనీష్ కుమార్ సారథ్యమే కారణం. దివాళా దిశలో వున్నా ‘ఎస్ బ్యాంక్’ను కాపాడటం ఆయన హయాంలో ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు కావడం విశేషం.
ప్రస్తుతం రజనీష్ హాంకాంగ్ అండ్ షంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ కు చెందిన ఆసియా విభాగానికి నాన్ –ఎగ్జిక్యుటీవ్ డైరెక్టర్ గా వున్నారు. ఆ బ్యాంకు ఆసియా విభాగంలో ఆడిట్ కమిటీలో, రిస్క్ కమిటీలో సభ్యుడిగా కూడా సేవలు అందించనున్నారు. బేరింగ్ ప్రైవేటు ఈక్విటీ పార్ట్నర్స్ ఇండియాకు సలహాదారుగా 2021 ఫిబ్రవరిలో చేరారు. కోటక్ ఇన్వెస్ట్ మెంటె అడ్వయిజర్ గా ఉంటారని కోటక్ మహేంద్ర బ్యాంకు ప్రకటించింది.
కాగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నదనీ, అందులో తన సహకారం కోసం తనను సలహాదారుగా నియమించిందనీ రజనీష్ కుమార్ వివరణ ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates