హుజురాబాద్ ఉప ఎన్నిక రద్దు..!

కేంద్ర ఎన్నికల సంఘం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ దెబ్బకు హుజురబాద్ ఉప ఎన్నిక వాయిదా పడింది. హుజరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక తో పాటు మరో మూడు పార్లమెంటరీ నియోజక వర్గాల్లోనూ ఉప ఎన్నికలను వాయిదా వేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

దీంతో హుజురాబాద్ మరియు బద్వేల్ నియోజకవర్గాల లో ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యం లో.. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన జారీ చేసింది.

కరోనా మహమ్మారి పరిస్థితులు చక్కబడ్డాక ఉప ఎన్నికల పై మళ్లీ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అన్ని పార్టీలు ప్రచారం జోరుగా చేస్తున్న సంగతి తెలిసిందే.