వైఎస్సార్ వర్థంతి.. ఒక్కటైన జగన్, షర్మిల..!

వైఎస్సార్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల కలిశారు. తండ్రి వర్థంతి కార్యక్రమంలో వీరు కలుసుకోవడం గమనార్హం. ఇడుపులపాయ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాల్లో సీఎం జగన్, షర్మిల ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సీఎం జగన్, షర్మిల ఇద్దరు కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పించడం గమనార్హం. వైఎస్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసి.. సీఎం జగన్, షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.

సీఎం జగన్, షర్మిల ఇద్దరు కలవడం తో అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మరియు ఇటు వైసీపీ పార్టీ లోనూ నూతన కోలాహలం నెలకొంది. అన్న జగన్ కు రాఖీ కట్టని షర్మిల.. ఇవాలైన కలిసినందుకు అందరూ సంతోషిస్తున్నారు. ఇక వీరిద్దరి కలయిక తో.. వారి రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మొన్నటి వరకు గొడవ పడ్డ అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు కలవడం రాజకీయంగా ఏమైనా మార్పులు తీసుకురానుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.