టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో.. చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. వారిపై ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. పలువురికి నోటీసులు కూడా అందాయి. కాగా.. ఈ అంశంపై తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు రోజులుగా మంత్రి కేటీఆర్ ఆందోళనలో ఉన్నారని… కేటీఆర్ దగ్గరి వారికి… డ్రగ్స్ నోటీసులు వచ్చాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈడీ నోటీసులు అందిన వారిలో కేటీఆర్ సన్నిహితులున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ పెద్దలు సైతం డ్రగ్స్ కేసు పై భయపడుతున్నారని… ఈడీ …విచారణ చేస్తే ప్రభుత్వ పెద్దలకు ఇబ్బంది ఎంటి ? అని ఆయన ప్రశ్నించారు . అసలు డ్రగ్స్ కేసులో కేటీఆర్ పాత్ర ఉందా.. ? రకుల్ పాత్ర ఉందా అనేది అసలు సమస్యే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ కు రకుల్ సన్నిహితులా..? కాదా ? అనే విషయం తనకు సంబంధం లేదని..డ్రగ్స్ కేసుపై మాత్రం విచారణ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. అసలు గోవాకి ఎందుకు కేటీఆర్ వెళ్ళాడని దానిపై దర్యాప్తు చేయాలని కోరారు. డ్రగ్స్ తో పిల్లల జీవితం సర్వ నాశనం అవుతుందని రేవంత్ అన్నారు. అప్పట్లో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న పలువురిని అకున్ సబర్వాల్ విడిచిపెట్టారని.. ఆతర్వాత కొన్ని రోజులకే కేసు మూసేశారని రేవంత్ గుర్తుచేశారు.