హుజురాబాద్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.మానకొండూరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రజాగాయకులు, రసమయి బాలకిషన్ కు మరో కీలక పదవి దక్కింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు కేబినేట్ హోదా కల్పిస్తూ…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
హుజురాబాద్ ఉప ఎన్నిక తరుముకొస్తున్న తరుణం లో రసమయి బాలకిషన్ కు మరో కీలక పదవి ఇవ్వడం తో.. కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వె డేక్కాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఓడించే నేపథ్యం లోనే రసమయి బాలకిషన్ కు కేబినేట్ హోదా ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.
కాగా… ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఇటీవల రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పదవి కేటాయించిన నెల కూడా గడవక ముందే.. ఇప్పుడు కేబినేట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.