అభ్యర్థులూ నేర చరిత్ర విప్పండి.. సుప్రీం కోర్టు..!

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా ఇక తమ నేర చరిత్రను బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. వారంతా గతంలో వారు చేసిన నేరాల పుట్టను విప్పాలంటూ సుప్రీం కోర్టు పేర్కొంది. ఎంపీలు,ఎమ్మెల్యేలపై ఆయా రాష్ట్రాల హైకోర్టుల అనుమతి లేకుండా వారిపై కేసులు ఉప సంహరించకూడదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేశారు.

ఎంపీలు,ఎమ్మెల్యేలపై కేసుల విచారణ చేపడుతున్న జడ్జీలు, కేసులు విచారణ,పెండింగ్ కేసులు,ఇచ్చిన తీర్పులు,రిజర్వు చేసిన తీర్పుల వివరాలు ఆయా రాష్ట్రాల హైకోర్టు రిజిస్టర్ జనరల్ లు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సత్వర న్యాయ విచారణ కోసం ఎంపీలు,ఎమ్మెల్యేలపై కేసుల విచారణ జరుపుతున్న స్పెషల్ కోర్టులు,సిబిఐ కోర్టుల జడ్జీలు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది .అలాగే రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటల లోపు వారి నేర చరిత్రను పబ్లిష్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.