రాజకీయంగా అత్యంత కీలకమైన నగరం విజయవాడ. ఇక్కడ ఒకప్పుడు కమ్యూనిస్టులు, తర్వాత.. కాంగ్రెస్ రాజకీయంగా రాజ్యమేలాయి. ఇక్కడ ఆ పార్టీల్లో ఉన్న నేతలే కారణం. కమ్యూనిస్టు, కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యతతోనే ఇక్కడ వారికి పట్టు చిక్కింది. టీడీపీ 1994, 1999లో అధికారంలో ఉన్నా కూడా విజయవాడ నగరంలో ఆ పార్టీని శాసించే నాయకులు లేరు.
అయితే 2014 తర్వాత మాత్రమే టీడీపీ కూడా ఇక్కడ పుంజుకుంది. రెండు అసెంబ్లీ.. ఒక పార్లమెంటు స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే.. ఇప్పుడు బెజవాడ టీడీపీలో నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో ఏం జరుగుతుందో ? చూస్తూనే ఉన్నాం. విజయవాడ టీడీపీ ఇప్పుడు మూడు ముక్కలు అయ్యి.. చీలికలు పీలికలు అయిపోయింది. ఈ గ్యాప్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని పుంజుకోవాల్సిన వైసీపీ నాయకులు కూడా ఇదే పద్ధితిలో ముందుకు సాగుతున్నారు.
బెజవాడ వైసీపీలో ఎందరో కీలక నేతలు ఉన్నా ఎవరూ కూడా ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడం లేదు. ఎవరికివారుగానే రాజకీయాలు చేసుకుంటూ… తమతమ వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడలోని సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలో ఉన్నాయి.
అదే సమయంలో తూర్పులో యువ నాయకుడు దేవినేని అవినాష్ దూకు డుగా ఉన్నారు.. అయితే.. పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న వెలంపల్లి శ్రీనివాస్ మంత్రి కూడా అయ్యారు. కానీ, ఆయనకు సెంట్రల్ ఎమ్మెల్యేకు మధ్య పొసగడం లేదని అంటున్నారు. ఇక, నగర పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న బొప్పన భవకుమార్‌ను ఎవరూ లెక్క చేయడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించడం.. జగన్ దగ్గర పలుకుబడి కోసం తహతహలాడడంతోనే కాలం గడిపేస్తున్నారనే వాద న బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. ఎవరికి వారు వ్యాపారాల్లోనూ మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఎక్కడికక్కడ గ్రూపులు, వర్గాలతో సతమతం అవుతోందని పరిశీలకులు చెబుతున్నారు.
సెంట్రల్ నియోజకవర్గంలో మళ్లీ టీడీపీ పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు.అదేసమయంలో బలమైన నాయకుడు కనుక.. వెస్ట్‌లో ఉంటే.. ఖచ్చితంగా వెలంపల్లికి బ్రేక్ పడుతుందని.. జనసేన ఇక్కడ కీలకమైన నేతను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తోందని.. అంటున్నారు. మరి ఇన్ని జరుగుతున్నా.. వైసీపీ నేతలు మాత్రం పుంజుకోవడం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates