షాక్ ఇచ్చిన మంత్రి: బాగా పనిచేస్తున్నా అమ్మేస్తారట

Vizag Steel Plant

లోక్ సభలో కేంద్ర ఉక్కశాఖ మంత్రి ఆర్సీపీ సింగ్ ఓ విచిత్రమైన ప్రకటన చేశారు. ఉక్కు పరిశ్రమల అమ్మకంపై ఓ ప్రశ్నకు సమాధానమిస్తు దేశంలోని అన్నీ పరిశ్రమల్లో ప్రైవేటు సంస్ధలకన్నా ప్రభుత్వ రంగ సంస్ధలే బాగా పనిచేస్తున్నట్లు అంగీకరించారు. దేశవ్యాప్తంగా 869 ప్రైవేటు ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలుంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో 9 పరిశ్రమలున్నట్లు మంత్రి చెప్పారు. గతేడాది అన్నీ ప్రైవేటు పరిశ్రమల ఉత్పత్తి టార్గెట్ 11.79 కోట్ల టన్నుల సామర్ధ్యంలో 8.4 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసినట్లు మంత్ర తెలిపారు.

ఇదే సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరిశ్రమలు 2.59 కోట్ల టన్నుల సామర్ధ్యంలో 1.95 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసినట్లు మంత్రి తెలిపారు. పనిలో పనిగా వైజాగ్ ఉక్కు పరిశ్రమ పనితీరు కూడా బాగున్నట్లు మంత్రి కమిట్ అయ్యారు. విచిత్రమేమిటంటే ప్రభుత్వరంగంలోని 9 ఉక్కు పరిశ్రమల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచింది విశాఖ ఉక్కేనట. 2020-21 సంవత్సరంలో విశాఖ ఉక్కు టార్గెట్ 63 లక్షల టన్నులకు గాను 43.02 లక్షల టన్నులను ఉత్పత్తి చేసిందని మంత్రి అంగీకరిచాంరు.

మరి ఇంతమంచి పనితీరును కనబరుస్తున్న విశాఖ ఉక్కును ఎందుకు ప్రైవేటుపరం చేయాలని నరేంద్రమోడి సర్కార్ డిసైడ్ చేసిందో ఎవరికీ అర్ధంకావటంలేదు. విశాఖ ఉక్కు మినహా మిగిలిన ఎనిమిది సంస్ధలకు ఇనుపఖనిజాలు సొంతానికి ఉన్నాయి. ఒక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాత్రమే ఇనుప ఖనిజాన్ని బయటనుండి కొంటోంది. ఇనుపఖనిజాన్ని బయట నుండి కొంటున్నా ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోవటం వల్ల మంచి ఫలితాలను సాధిస్తోందన్న విషయం అందరికీ అర్ధమవుతోంది.

ఇదేగనుక ఇతర పరిశ్రమలకు ఉన్నట్లే విశాఖ ఉక్కుకు కూడా సొంత గనులుంటే బయటనుండి ఖనిజాన్ని కొనాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఉత్పత్తి వ్యయం మరింత తగ్గటం వల్ల లాభాలు మరింతగా పెరుగుతాయి. దశాబ్దాల తరబడి వైజాగ్ స్టీల్స్ కు సొంతగనులను కేటాయించాలని రాష్ట్రప్రభుత్వం అడుగుతున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. పూర్తిగా విశాఖ ఉక్కు మీద నిర్లక్ష్యం చూపటమే కాకుండా మంచి ఫలితాలు చూపిస్తున్న ఫ్యాక్టరీని అమ్మేయాలని డిసైడ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)