మోడికి వ్యతిరేకంగా మమత మొదటి స్టెప్ ?

Mamata

ఉమ్మడి ప్రత్యర్ధిని ఎదుర్కొనేందుకు ఇద్దరు ఏకమవుతున్నారా ? ఢిల్లీ కేంద్రంగా మొదలైన రాజకీయ పరిణామాలు చూస్తుంటే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నరేంద్రమోడిని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు బద్ధ శతృవులైన కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ చేతులు కలుపుతున్నట్లే ఉన్నాయి. ఈనెల 25వ తేదీన సోనియాగాంధీ-మమత భేటీ జరగబోతోందని సమాచారం.

19వ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న విషయం తెలిసిందే. ఆ సమావేశాల్లో ఎన్డీయేని ఇరుకునపెట్టడానికి తృణమూల్ ఎంపీలు రెడీ అవుతున్నారు. 25వ తేదీన మమత ఢిల్లీకి చేరుకుంటారని సమాచారం. వచ్చే ఏడాది ఆరు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో తృణమూల్ పోషించాల్సిన పాత్రపై వివిధ పార్టీల అధినేతలతో చర్చించనున్నారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు చాలామంది ప్రతిపక్షాలకు చెందిన అధినేతలతో భేటీ అవటానికి మమత ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటగా సోనియా గాంధీ+రాహూల్ గాంధీతో భేటీ అవబోతున్నారు. ప్రతిపక్షాల్లో చాలామందికి నరేంద్ర మోడియే ప్రధానమైన టార్గెట్. కాబట్టి మమత కూడా మోడికి వ్యతిరేకంగా బాగా యాక్టివ్ అయిపోయారు.

సో మోడిపై ప్రతిపక్షాల్లో ఉన్న వ్యతిరేకత ఏ స్ధాయిలో ఉంది ? మోడికి వ్యతిరేకంగా ఎంతమంది ఏకతాటిపైకి వస్తారు ? అనే విషయం తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుంది. ఇందుకు ఒకవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మరోవైపు మమత బెనర్జీ పెద్ద కసరత్తే చేస్తున్నట్లున్నారు. చూద్దాం దేశ రాజకీయాలు తొందరలో చాలా హాటుగా హాటుగా మారిపోతాయేమో.