వైసీపీలో ఇదే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత…. ఆయన లెక్కకు మిక్కిలిగా సలహాదారు పదవులు కేటాయించారు. తనకు ఎన్నికల సమయంలో సాయం చేసిన వారితోపాటు.. మీడియా పరం గా తన వాయిస్‌ను బలంగా వినిపించిన వారిని కూడా ఆయన అక్కున చేర్చుకుని సలహాదారు పదవులకు ప్రమోట్ చేశారు.
ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఒకరిద్దరు సలహాదారులు మాత్ర తమ విధులకు దూరంగా.. రాజకీయాలు చేయడం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొందరు ఏకంగా.. సాక్షాత్తూ.. అప్రకటిత ఎమ్మెల్యేలుగా, ఎంపీలు గా వ్యవహరిస్తున్నారు.
ఢిల్లీలో ఒక కీలక సీనియర్ పాత్రికేయుడు.. వైసీపీ సలహాదారుగా ఉన్నారు. అయితే.. ఆయన ఢిల్లీలో వైసీపీ వాయిస్ వినిపిస్తు న్నాయి. సీఎం జగన్ ఢిల్లీ టూర్లో ఆయనదే కీలక పాత్ర. అదే సమయంలో రాజకీయ వర్గాల్లోనూ వైసీపీకి.. మంచి మార్కులు పడేలా.. జాతీయ మీడియాతో ఆయన వ్యవహరిస్తున్న తీరు.. విమర్శలకు తావిస్తోంది.
ఇక, ఇక్కడే ఉన్న మరో కీలక సలహా దారు కూడా రాజకీయాలు మాట్లాడుతూ.. నిత్యం మీడియాలో ఉంటున్నారు. ఈ పరిణామాలతో.. వీరు హైలెట్ అవుతున్నారు. అయితే.. ఇవన్నీ ఇలా.. ఉంటే.. తాజాగా సలహాదారుల నియామకం, వారికి ఇస్తున్న జీతాలు.. వారి విధులపై హైకోర్టు త్వరలోనే సమీక్ష చేయనుంది.
సలహాదారులు.. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే పని మానేసి.. రాజకీయంగా హైలెట్ కావడంపై హై కోర్టు సీరియస్ అయింది. ఈ క్రమంలోనే సలహాదారుల లెక్కలు తేలుస్తామని కూడా వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పటి వరకు లక్షల రూపాయలు జీతంగా తీసుకుంటూ.. సలహాదారులుగా ఉన్న ఈ ఇద్దరి విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారని.. రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న సలహాదారును ఎమ్మెల్సీగా పంపి.. రాజకీయంగా చక్రం తిప్పేలా వ్యవహరిస్తారని.. అంటున్నారు.
అదే సమయంలో కేంద్రంలో చక్రం తిప్పుతున్న సలహాదారు విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తారని.. ఈ ఇద్దరినీ ఎట్టి పరిస్థితిలోనూ.. వదులుకునేది లేదని జగన్ గురించి తెలిసిన వారు గట్టిగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates