రాజకీయాల్లో ఉన్న వారు ఎవరైనా అన్ని వర్గాలను కలుపుకొని పోవాల్సిందే. ఎన్నికల సమయంలో అందరిపాత్రా.. నాయకుల కు అత్యంత కీలకం. దీంతో సమాజంలోని అన్ని వర్గాలూ.. అన్ని పార్టీలకూ అవసరమే. గత ఎన్నికలకు ముందు.. వైసీపీ అధినేత జగన్.. ఇలా అన్ని వర్గాలను కలుపుకొని పోయారు.
ఈ క్రమంలోనే ఆయన పాదయాత్ర సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగుల సంఘాలు.. ఆయనను కలిసి.. కొన్ని విన్నపాలు చేశాయి. వర్క్ భారం తమపై పెరిగిపోతోందని.. అలవెన్సులు ఆగిపోతున్నాయని.. తమకు ఏపీలో ఇళ్లు, స్థలాలు కూడా లేవని.. ఇలా అనేక ప్రతిపాదనలు పెట్టారు.
వీటన్నింటినీ సావధానంగా విన్న జగన్.. తాను అధికారంలోకి వచ్చాక.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే. అధికారంలోకి వచ్చారు కానీ.. ఇప్పటి వరకు సమస్యలు పరిష్కరించింది లేదు. పైగా.. ఉద్యోగులపై భారం పెరిగింది. వారికి సమయానికి వేతనాలు కూడా అందడం లేదు.
దీంతో ఇటీవల సలహాదారు సజ్జలకు ఉద్యోగులు ఈ విషయాన్నే మొర పెట్టుకున్నారు. కానీ, ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేక పోయారు. దీంతో విజయవాడ కేంద్రంగా రెడ్డి సామాజిక వర్గం ఉద్యోగులు రహస్యంగా భేటీ అవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
గతంలో తాము జగన్కు సహకరించబట్టే.. ఆయన అధికారంలోకి వచ్చారనేది వీరి వాదన. ఇప్పుడు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోగా.. పనిభారం పెరిగిపోయిందని.. వేతనాలు పదో తేదీ వచ్చినా.. ఇవ్వడంలేదని.. దీంతో సంఘాల్లో చీలికలు వచ్చే అవకాశం ఉందని.. కొందరు నేతలు బాధపడుతున్నారు. దీంతోపెన్డౌన్ చేసి.. సర్కారును ఇరకాటంలోకి నెట్టడ మా? లేక.. ఏం చేయాలనే విషయంపై వారు మేధోమథనం చేస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలో చంద్రబాబు హయాంలోనూ రెండు ఉద్యోగ సంఘాలు ఇలానే భేటీ అయి.. ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన విషయాన్ని బట్టి చూస్తే.. ఇప్పుడు ఇదే తరహా వ్యవహారం నడుస్తోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి ముందుగానే అడ్డుకట్ట వేయకపోతే..కీలకమైన ఉద్యోగ వర్గాలు జగన్కు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates