జమ్మూ-కాశ్మీర్ తో ఆడుకుంటున్న కేంద్రం

దేశంలోనే అత్యంత సున్నితమైన ఓ భూభాగం జమ్మూ-కాశ్మీర్ విషయంలో నరేంద్రమోడి సర్కార్ ఆటలాడుకుంటున్నట్లుంది. తనిష్టప్రకారం ఒకసారి రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా విభజించటం లేదా రాష్ట్ర హోదా ఇవ్వటం చేస్తోంది. దశాబ్దాల ప్రకారం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్ కు యూపీఏ ప్రభుత్వం అప్పుడెప్పుడో సంపూర్ణ రాష్ట్రహోదా ఇచ్చింది. తర్వాత ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.

దేశానికి జమ్మూకాశ్మీర్ చాలా ముఖ్యమన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి రాష్ట్రానికి నరేంద్రమోడి 2019లో రాష్ట్రహోదా రద్దుచేశారు. పైగా రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విడదీసి కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఇందుకోసం ఆర్టికల్ 370ని రద్దుకూడా చేశారు. ఆర్టికల్ 370 అమలు వల్ల రాష్ట్రానికి ఉండే కొన్ని ప్రత్యేక పరిస్ధితులను కూడా రద్దుచేసింది ఎన్డీయే సర్కార్.

నిజానికి జమ్మూకాశ్మీర్ ను కబళాంచాలని ఒకవైపు పాకిస్ధాన్, మరోవైపు డ్రాగన్ చేయని ప్రయత్నాలు లేవు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఆర్టికల్ 370 రద్దుతో పాటు రాష్ట్రహోదాను రద్దు చేసిందని అప్పట్లో మోడి చెప్పుకున్నారు. జమ్మూకాశ్మీర్ పై సంపూర్ణ ఆధిపత్యం కోసం, తీవ్రవాద, ఉగ్రవాద చర్యలను అణిచేయటం, చొరబాట్లను సమర్ధవంతంగా అడ్డుకునేందుకు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసినట్లు సమర్ధించుకున్నారు.

అప్పట్లో మోడి చెప్పిన కారణాలకు జనాలు మద్దతిచ్చారు. మరి రెండేళ్ళల్లో చొరబాట్లు అడ్డుకోలేకపోయారు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను అడ్డుకోలేకపోయారు. గడచిన రెండేళ్ళల్లో సరిహద్దులతో పాటు లడ్డాఖ్ లోయ ప్రాంతంలో ఎన్ని గొడవలు జరిగింది దేశమంతా చూసిందే. మరి తమ అజెండాలో ఏమి సాధించిందని మోడి సర్కార్ అనుకుంటోందో అర్ధం కావటంలేదు. హఠాత్తుగా జమ్మూకాశ్మీర్ కు రాష్ట్రహోదా ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. మరి మాజీ ముఖ్యమంత్రులు, ప్రముఖ నేతలతో 24వ తేదీన జరిపే సమావేశంలో ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.