రాజకీయ నాయకులు ప్రసంగాలు ఇచ్చేటపుడో.. ప్రెస్ మీట్లలోనో మాటలు తడబడితే.. అవి పట్టుకుని సోషల్ మీడియా జనాలు ఎంతగా ట్రోల్ చేసేస్తుంటారో తెలిసిందే. వాటి ఆధారంగా కొందరి మీద ఒక ముద్ర వేసి అదే పనిగా కామెడీ చేస్తుంటారు. జాతీయ నాయకుల్లో రాహుల్ గాంధీ.. ఏపీ వరకు తీసుకుంటే నారా లోకేష్ ఇలాగే లక్ష్యంగా మారిపోయారు. కొంచెం ఛాన్సిచ్చేసరికి దాన్ని ఉపయోగించుకుని రాజకీయ ప్రత్యర్థులు వాళ్లను దారుణంగా ట్రోల్ చేసి ఇమేజ్‌ను దెబ్బ తీశారు.
కొన్నిసార్లు అవతలి వ్యక్తులను టార్గెట్ చేయబోయి తామే నవ్వుల పాలయ్యే సందర్భాలు కూడా ఎదురవుతాయి. తాజాగా రాహుల్ గాంధీని ట్రోల్ చేయబోయి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు ఇలాగే కామెడీ పీస్‌లు అయిపోయారు. రాహుల్ తప్పులో కాలేశాడని చూపించబోయి తామే బొక్కబోర్లా పడ్డ ఉదంతమిది.
లెజెండరీ అథ్లెట్ మిల్కా సింగ్ శుక్రవారం అర్ధరాత్రి కన్నమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు నివాళిగా శనివారం ఉదయం రాహుల్ గాంధీ ఒక ట్వీట్ వేశారు. అందులో చివరి వాక్యంగా India remembers her #flying sikh అని పేర్కొన్నాడు రాహుల్. ఐతే ఇదో పెద్ద తప్పు అన్నట్లుగా ఒక బీజేపీ మద్దతుదారు రాహుల్‌ను ట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. ఈ వాక్యంలో ఉండాల్సింది ‘her’ కాదు ‘him’ అంటూ వెటకారంగా ట్వీట్ వేసిందామె.
ఐతే ఇక్కడ వాక్యం India remembers herతో ముగిసిపోలేదు. India remembers her flying sikh అన్నది రాహుల్ ఉద్దేశం. ఐతే flying sikh ముందు హ్యాష్ ట్యాగ్ సింబల్ రావడంతో అది వేరే పదం అనుకుని.. ముందు వాక్యం ముగిసిందనుకుని రాహుల్‌ను ట్రోల్ చేసింది సదరు వ్యక్తి. ఆమె ఇలా ట్వీట్ వేయడం.. బీజేపీ మద్దతుదారులంతా పెద్ద వచ్చేసి రాహుల్‌కు ఈ మాత్రం ఇంగ్లిష్ కూడా రాదా ట్రోల్ చేయడం జరిగిపోయింది. కానీ రాహుల్ మద్దతుదారులు తర్వాత రివర్స్ ఎటాక్ చేయడంతో బీజీపీ సపోర్టర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో ముందు రాహుల్‌ను ట్రోల్ చేస్తూ వేసిన ట్వీట్‌ను సదరు నెటిజన్ డెలీట్ చేసేసింది. మిగతా బీజేపీ సపోర్టర్స్ కూడా తమ ట్వీట్లను తీసేయక తప్పలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates