పొంగులేటికి మంత్రి పదవి దక్కేనా..?

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన కొందరు సీనియర్లు ఎప్పటి నుంచో పదవుల కోసం ఆశగా ఎదురు చేస్తున్నారు. కాగా.. వారిలో కొందరికి ఈ సారి మాత్రం కచ్చితంగా పదవులు దక్కేలా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు, గవర్నర్ కోటాకు సంబంధించి ఒక స్థానం ఖాళీ అయ్యాయి. దీంతో.. వీటి కోసం ఆశావాహులు ఇప్పటి నుంచే పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు.

మరికొద్దిరోజుల్లో మంత్రి వర్గ వస్తరణ ఉండే అవకాశం ఉంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఈసారి మంత్రి పదవి దక్కించుకునేవారిలో ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి.

వీరిద్దరిలో ఒకరికి కచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే.. ఇద్దరిలో ఎవరికి దక్కనుంది అనే విషయమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ ఇద్దరు నేతలకు ఖమ్మం జిల్లాలో మంచి కేడర్ ఉంది. దీంతో.. ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడానికి అధిష్టానం సముఖంగానే ఉంది. అయితే.. వారిలో ఒకరికి మాత్రమే మంత్రి పదవి దక్కనుంది. అది కూడా తుమ్మలతో పోలిస్తే.. పొంగులేటికే ఎక్కువ ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ లో చేరిప్పటి నుంచి చాలాసార్లు పొంగులేటికి పదవులు ఇస్తామని చెప్పి ఇవ్వేలేదు. దీంతో ఈ విషయంలో పొంగులేటి.. అతని అభిమానులు చాలా అసంతృప్తిలో ఉన్నారట. అందుకే ఈ సారి.. పొంగులేటికి పదవి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది.