మోడికి ఘాటు లేఖలు రాస్తున్న సీఎంలు

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ను ముఖ్యమంత్రులందరు తప్పు పడుతున్నారు. ఒకవైపు టీకా కార్యక్రమాన్ని తప్పుపడుతు సుప్రింకోర్టు వాయించేస్తోంది. ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తప్పుపడుతూ మోడికి లేఖలు రాయటం గమనార్హం. మొన్నటికి మొన్న కేరళ ముఖ్యమంత్రి పనరయి విజయన్ ప్రధానికి లేఖ రాశారు. తాజాగా ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా టీకాల కార్యక్రమంపై మోడి విధానాన్ని తీవ్రంగా తప్పుపడుతూ లేఖ రాశారు.

ఇప్పటికే ఇదే విషయమై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మోడి విధానాలను తప్పుపడుతూ లేఖలు రాశారు. వీళ్ళందరు మోడికి లేఖలు రాయటంలో ఆశ్చర్యమేమీ లేదుకానీ ఒడిస్సా ముఖ్యమంత్రి పట్నాయక్ లేఖ రాయటమే కాస్త ఆశ్చర్యపరిచే విషయం.

మోడి ప్రధాని అయినదగ్గర నుండి ఏదో రూపంలో మోడిపై చాలామంది ముఖ్యమంత్రులు రుసరుసలాడుతునే ఉన్నారు. కేజ్రీవాల్, మమత ఇప్పటికే చాలాసార్లు మోడికి అనేక అంశాలపై లేఖలు రాయటం అందరికీ తెలిసిందే. ఎవరు మోడిని తప్పుపట్టినా వ్యాక్సినేషన్ కార్యక్రమమే కీలక అంశంగా మారింది. అయితే మిగిలిన సీఎంలు ఒకఎత్తతయితే ఒడిస్సా ముఖ్యమంత్రి పట్నాయక్ మాత్రం మరోఎత్తనే చెప్పాలి.

ఎందుకంటే పట్నాయక్ ఏ విషయంలో కూడా వివాదాలకు దూరంగా ఉంటాడు. ఇటు కేంద్రంతో కానీ అటు సహచర ముఖ్యమంత్రులతో కూడా ఎవరికీ ఇబ్బందులు కలగకుండా తన పనేదో తాను చేసుకువెళుతుంటారు. కేంద్రంతో ఎంతపెద్ద సమస్య వచ్చినా వీలైనంతలో సామరస్యపూర్వకంగానే పరిష్కరించుకునేందుకు చూస్తారు. అలాంటిది టీకాల కార్యక్రమాన్ని తప్పుపడుతూ మోడికి పెద్ద లేఖ రాశారు. అలాగే అదే లేఖను ఇతర ముఖ్యమంత్రులకు షేర్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

మోడి విధానాలను ఒకవైపు సుప్రింకోర్టు, మరోవైపు ముఖ్యమంత్రులు తప్పుపడుతున్నారు. మరి తన విధానాలను మోడి మార్చుకుంటారా ? ముఖ్యమంత్రులు చెప్పారని కాకపోయినా కనీసం సుప్రింకోర్టు చెప్పినందుకైనా మార్చుకోక తప్పదుకదా. సుప్రింకోర్టు చెప్పిన తర్వాత కూడా మార్చుకోకపోతే జనాలే మార్చేస్తారు.