సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో తూర్పు గోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం ఎమ్మెల్యే.. దాడిశెట్టి రాజా. ఈ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు గట్టి పట్టుంది. అయితే.. దాడిశెట్టి ఎంట్రీతో ఇక్కడి పాలిటిక్స్‌ను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై రాజా వరుస విజయాలు దక్కించుకున్నారు. ఇక్కడి ప్రజల ప్రధాన డిమాండ్ పరిష్కరిస్తామని.. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
తుని ప్రజలు ప్రధానంగా రెండు డిమాండ్లు తెరమీదకి తెచ్చారు. స్థానికంగా తమకు ఇబ్బందిగా మారిన దివీస్ ల్యాబ్ లేటరీని ఏర్పాటు చేయొద్దని.. కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో దివీస్‌కు వ్యతిరేకంగా దాడిశెట్టి.. ప్రజలతో కలిసి పోరాటం చేశారు. దివీస్‌కు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించవద్దని కూడా నాడు గట్టిగా పట్టుబట్టారు. దీంతో ప్రజలు ఆయనకు మద్దతుగా.. గత ఎన్నికల్లోనూ వరుసగా గెలిపించారు. ఇక, జగన్ కూడా.. ఇక్కడ ఎన్నికల ప్రచారంలో.. రాజా లేవనెత్తిన డిమాండ్‌కు సై.. అన్నారు.
ఎట్టిపరిస్థితిలోనూ దివీస్‌కు అనుమతి ఇచ్చేది లేదన్నారు. దీంతో ప్రజలు కూడా విశ్వసించారు. అయితే.. జగన్ అధికారంలోకి వచ్చాక.. దివీస్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. పైగా శంకుస్థాపనకు ఆయనే స్వయంగా హాజరయ్యారు. దీంతో దాడిశెట్టికి తీవ్ర ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా.. జనసేన నాయకులు కూడా టార్గెట్ చేస్తున్నారు.
మరోవైపు.. నియోజకవ ర్గంలో మత్స్య కారులకు అవసరమైన అభివృద్ధి పనులు చేయిస్తానన్నప్పటికీ.. దాడిశెట్టి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి నిధులు కూడా అందడంలేదని.. స్థానిక నేతలు వాపోతున్నారు. ఇలా.. జగన్ తీసుకున్న నిర్ణయం తుని ఎమ్మెల్యే ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరికి గురవుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates