మంత్రి వెలంప‌ల్లికి మ‌రో సెగ‌.. ఏం జ‌రిగింది ?


ఇటీవ‌ల కాలంలో తీవ్ర వివాదాస్ప‌ద మంత్రిగా గుర్తింపు పొందిన దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ ‌కు ఇప్ప‌డు మ‌రో సెగ త‌గిలింది. రెండు రోజుల కింద‌ట‌.. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని వ్యాపారులు.. పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి ఏం చేశారంటూ.. వారు ప్ర‌శ్నించారు. అంతేకాదు.. మంత్రిగారికి కొన్ని ప్ర‌శ్న‌లు అంటూ.. సోష‌ల్ మీడియాలో వంద ప్ర‌శ్న‌లు సంధించారు. వీటిలో ప్ర‌ధానంగా.. కీల‌క‌మైన విజ‌య‌వాడ వ‌న్ టౌన్‌లోని ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, వ్యాపారులు క‌డుతున్న జీఎస్టీ ప‌రిధిని త‌గ్గించ‌డం.. రాష్ట్రం వేస్తున్న ప‌న్నుల‌ను త‌గ్గించ‌డం వంటివి వారు ప్ర‌శ్నిస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఇవే ప్ర‌శ్న‌లు వారి నుంచి వ‌చ్చాయి. అయితే.. అప్ప‌ట్లో వీటిని తాను తీరుస్తానంటూ.. వెలంప‌ల్లి హామీ ఇచ్చారు.కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క స‌మ‌స్య‌పైనా.. ఆయ‌న దృష్టి పెట్ట‌లేదు. కేవ‌లం తాను నివ‌సిస్తున్న వ‌న్‌టౌన్‌లోని గోశాల రోడ్డును మాత్రమే స‌ర్వాంగ సుంద‌రంగా అభివృద్ధి చేసుకున్నార‌ని.. మిగిలిన ర‌హ‌దారుల‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఇక్క‌డి వ్యాపారుల మాట‌. ఇక‌, బంగారం వ్యాపారం ఎక్కువ‌గా సాగే.. ఈ ప్రాంతంలోని వ్యాపారుల‌కు పోలీసుల నుంచి వేధింపులు కూడా ఎక్కువ‌గానే ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో గ‌తంలోనే వారు అనేక విధాలుగా వేధిస్తున్న త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని మంత్రిని వేడుకున్నారు. ఇప్ప‌టి వ‌రకు ఈ స‌మ‌స్య‌ను మంత్రి ప‌రిష్క‌రించ‌లేక పోయారు. ఇక‌, భ‌వానీ పురం అభివృద్ధి, విద్యాధ‌రపురంలో ర‌హ‌దారుల వెడ‌ల్పు వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా మంత్రి పెడ‌చెవిన పెట్టార‌ని.. ఇక్క‌డి జ‌నాలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డి అభివృద్ధి అక్క‌డే నిలిచిపోయింద‌నేది వ్యాపార వ‌ర్గాల ఆరోప‌ణ‌. దీనికి తోడు ఇటీవ‌ల విజ‌య‌వాడ వైశ్య వ‌ర్గం వారు ఓ స‌మావేశానికి త‌మ వ‌ర్గం నేత అని ఆహ్వానిస్తే దానికి కూడా ఆయ‌న కావాల‌నే వెళ్ల‌లేద‌ని వారంతా మండిప‌డుతున్నారు. ఆ మాట‌కు వ‌స్తే వైశ్యం వ‌ర్గంలో గ‌తంలో మంత్రులుగా ఉన్న వారు రాష్ట్ర స్థాయిలో త‌మ వ‌ర్గం వారికి కావాల్సిన ప‌నులు చేసి.. ఆ సమాజానికి బాగా ఉప‌యోగ‌ప‌డ్డారు.

కానీ వెళ్లంప‌ల్లి ఈ విష‌యంలో వారిని పూర్తిగా డిజ‌ప్పాయింట్ చేశారు. ఇక అటు త‌న శాఖా ప‌రంగా కూడా ఆయ‌న‌కు మంచి మార్కులు లేవ‌నే పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఏదేమైనా వెల్లంప‌ల్లికి వ‌రుస‌గా ఏదో ఒక సెగ త‌ప్ప‌డం లేదు. ఇక ఇలాంటి పెర్పామెన్స్‌తో ఆయ‌న మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో త‌న ప‌ద‌విని ఎంత వ‌ర‌కు నిలుపుకుంటారు ? అన్న‌ది కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి.