తమిళనాడు ఎన్నికల్లో మొత్తానికి ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. ఉదయనిధి ఎన్నికల్లో పోటీ చేయటం ఇదే మొదటిసారి. మొదటసారి పోటీలోనే తాత పోటీ చేసిన చేపాక్-ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండే పోటీ చేయబోతున్నారు. కరుణానిధి మూడుసార్లు ఇదే నియోజకవర్గం నుండి గెలిచారు. కాబట్టి మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్న మనవడు సేఫ్ నియోజకవర్గాన్నే ఎంచుకున్నట్లయ్యింది.
ప్రస్తుతానికి ఉదయనిధి డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పోటీ చేయాలనే విషయంలో మొదటినుండి బాగా ఆసక్తిగా ఉన్నారు. ఇందులో భాగంగానే పోటీ చేయటానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే ఈమధ్యనే జరిగిన ఇంటర్వ్యూలో ఉదయనిధికి టికెట్ నిరాకరించినట్లు స్వయంగా డీఎంకే చీఫ్ స్టాలిన్ ప్రకటించారు.
ప్రస్తుతానికి పోటీ విషయంలో కాకుండా అభ్యర్ధుల విజయానికి అవసరమైన ప్రచారం చేయాలని ఆదేశించారు. ఇందుకు ఉదయనిధి కూడా అంగీకరించినట్లు డీఎంకే ప్రకటించింది. అయితే తెరవెనుక ఏమైందో తెలీదు కానీ హఠాత్తుగా చేపాక్-ట్రిప్లికేన్ సీటు నుండి ఉదయనిధి పోటీ చేస్తారనే ప్రకటన వచ్చింది. దాంతో ఉదయనిధి పోటీ కన్పర్మ్ అయిపోయింది.
ఉదయనిధి కూడా తాత కరుణానిధి లాగే సినీరంగంలో నుండే వచ్చారు. తాత రచయితగా సినీరంగంలో ప్రవేశించినా మనవడు మాత్రం అతిధి పాత్రతో రంగ ప్రవేశంచేసి తర్వాత హీరోగా స్ధిరపడ్డారు. ఇప్పటివరకు 14 సినిమాల్లో ఉదయనిధి నటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates