- సొసైటీ బైలాస్‌లోని రూల్ 22ఏను అమలును నిలిపేస్తూ కోఆపరేటివ్ కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్.
- పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చిన హైకోర్టు
- శుక్రవారం తీర్పు వెలువరించిన జస్టిస్ అమర్నాథ్గౌడ్ బెంచ్
- ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు
- నోటిఫికేషన్ విడుదలైనందున పిటిషన్ విచారణార్హం కాదన్న అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు
- మెజార్టీ సభ్యుల విశ్వాసం పొందిన వారు గెలుస్తారని, పోటీ చేసే అవకాశం అందరికీ ఉండాలన్నదే సొసైటీ ఉద్దేశమని తెలిపిన సొసైటీ తరఫు సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్
- ఎన్నికల ప్రక్రియను సవాల్ చేయడం లేదని, నోటిఫికేషన్ కంటే ముందు ఇచ్చిన కోఆపరేటివ్ కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను మాత్రమే కొట్టేయాలని కోరుతున్నామన్న పిటిషనర్
- పిటిషనర్ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు
- ప్రొసీడింగ్స్ కొట్టేయాలన్న మధ్యంతర దరఖాస్తు కొట్టివేస్తూ ఆదేశాలు..
Tags Jubilee Hills Housing Society Polls