ఒక ట్వీట్ చేసి లక్ష కోట్లు పోగొట్టుకున్నాడు !

ఒక ట్వీట్ విలువ రూ.1.10లక్షల కోట్లా? అంటే అవుననే చెప్పాలి. తాజాగా అపర కుబేరుడు చేసిన ఒక్క ట్వీట్ అతగాడి ఆస్తిని అమాంతం తగ్గేలా చేసింది. ఇంతకీ ఆ అపర కుబేరుడు ఎవరు? అతను చేసిన ట్వీట్ సారాంశం ఏమిటి? అంతలా ఆయన ఆస్తి ఎందుకు కరిగిపోయింది? అన్న వివరాల్లోకి వెళితే..

ప్రముఖ విద్యుత్ కార్ల కంపెనీ సంస్థ టెస్లా అధినేత.. ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ తాజాగా చేసిన ఒక ట్వీట్ తో ఆయన ఆస్తి ఏకంగా రూ.1.10లక్షల కోట్లు ఆవిరి అయ్యేలా చేసింది. బిట్ కాయన్లపై ఆయన చేసిన ట్వీట్ తో ఇలాంటి పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఎలాన్ మాస్క్ బిట్ కాయన్లకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఆయన ఈసారి నెగిటివ్ గా మట్లాడారు.

చూస్తుంటే బిట్ కాయన్.. ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. అంతే.. ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారటమే కాదు.. క్రిప్టో కరెన్సీ విలువ ఒక్కసారిగా ఎనిమిది శాతం కుంగిపోవటం చూస్తే.. ఆయన నోటి నుంచి వచ్చే మాటకు ఇంత విలువ ఉందా? అన్న క్వశ్చన్ మదిలో మెదలక మానదు. ఎలాన్ చేసిన ట్వీట్ తో బిట్ కాయిన్ ధర మాత్రమే కాదు.. ఆయన కంపెనీ షేర్లు కూడా భారీగా పడిపోయాయి.

2020 సెప్టెంబరు తర్వాత ఇంత కాలానికి ఇంత భారీగా టెస్లా షేర్లు పడిపోవటం గమనార్హం. అది కూడా తాను చేసుకున్న ట్వీట్ తోనే కావటం మరింత ఆసక్తికరంగా. తాజాగా పడిపోయిన ఆయన కంపెనీ షేరు విలువ మన రూపాయిల్లో రూ.1.10 లక్షల కోట్లు డిపోయింది. వాస్తవానికి క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇచ్చే ఎలాన్ మాస్క్.. రెండు వారాల క్రితం 1.5 బిలియన్ డాలర్ల విలువైన బిట్ కాయన్లను కొనుగోలు చేశారు. అంతేకాదు.. తన విద్యుత్ కార్ల విక్రయానికి క్రిప్టో కరెన్సీలో చెల్లిస్తానన్నా ఓకే చెప్పనున్నారట. మొత్తంగా ఒక ట్వీట్ విలువ ఇంత ఖరీదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.