మద‌న‌ప‌ల్లె జంట హ‌త్య‌ల కేసులో ఒళ్లు గ‌గుర్పొడిచే నిజాలు

చిత్తూరు జిల్లా మద‌న‌ప‌ల్లె జంట హ‌త్య‌ల కేసులో రోజుకో సంచ‌ల‌న విష‌యం.. ఒళ్లు గ‌గుర్పొడిచే నిజాలు వెలుగు చూస్తున్నాయి. మూఢ భ‌క్తి.. మితిమీరిన విశ్వాసంతో.. ట్రాన్స్‌లోకి వెళ్లిపోయిన ఓ ఉన్న‌త విద్యా కుటుంబం.. దారుణ‌మైన ప‌రిస్థితికి చేరుకుంది. పున‌ర్జ‌న్మ‌-భ‌గ‌వంతుడు బ‌తికిస్తాడు.. అనే అంధ విశ్వాసం తో.. యుక్త‌వ‌య‌సుకు వ‌చ్చిన క‌న్న బిడ్డ‌ల ప్రాణాల‌ను తీసిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిం ది. పురుషోత్త‌మ‌నాయుడు, ప‌ద్మ‌జ దంప‌తులు.. త‌మ ఇద్ద‌రు ఆడ బిడ్డ‌ల‌ను అంత‌మొందించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రు దంప‌తుల‌ను పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.

ఇక‌, పోలీసు క‌స్ట‌డీలోనూ ఈ ఇద్ద‌రు దంప‌తులు వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం మ‌రింత ఆశ్చ‌ర్య‌కరంగా మారింది. రెండు రోజుల కింద‌ట… ప‌ద్మ‌జ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. తెలిసిందే. నేనే శివుణ్ని.. క‌రోనా నానుంచే పుట్టింది. చెత్త‌ను క‌డిగేయ‌డానికే క‌రోనా వ‌చ్చింది.. క‌లియుగం అంత‌మై.. స‌త్య యుగం వ‌స్తోంది! వంటి వ్యాఖ్య‌ల‌తో పోలీసుల‌ను సైతం ప‌ద్మ‌జ హ‌డ‌లెత్తించింది. ఇక, ప‌ద్మ‌జ మాన‌సిక ప‌రిస్థితి బాగోలేక పోవ‌డంతో.. ఆమె భ‌ర్త‌,పురుషోత్త‌మ నాయుడును పోలీసులు ఆరాతీశారు. ఈయ‌న మ‌రిన్ని సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు.

‘తనను తాను కాళికగా భావించుకున్న నా భార్య పద్మజ.. పెద్ద కుమార్తె అలేఖ్య (27)ను చంపిన తర్వాత ఆమె నాలుకను కోసి తినేసింది’ అని పురుషోత్తంనాయుడు చెప్పినట్టు తెలిసింది. దీంతో విచార‌ణాధికా రులు విస్తుపోయారు. ఈ నేప‌థ్యంలో అలేఖ్య నాలుక ప‌రిస్థితి ఏంటి? ఇది నిజ‌మేనా? అనేఅనుమానాలు త‌లెత్తాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అంద‌రి దృష్టీ పోస్టు మార్టం రిపోర్టుపైనే ప‌డింది.

అలేఖ్య‌ ప‌రిస్థితీ ఇంతే..!
మ‌ద‌న‌ప‌ల్లె ఘ‌ట‌న‌లో మృతి చెందిన అలేఖ్య మాన‌సిక స్థితి కూడా దారుణ‌మైన ప‌రిస్థితిలోనే ఉండేద‌ని.. పురుషోత్త‌మ నాయుడు వెల్ల‌డించిన స‌మాచారాన్ని బ‌ట్టి తెలుస్తోంది. తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య చెప్పేదని పురుషోత్తం తెలిపారు. ‘పాఠాలు చెప్పడం నీ వృత్తి కాదు.. పాండవుల తరఫున అర్జునుడు ముందుండి నడిపిన పోరాటస్ఫూర్తిని కొనసాగించాలి’ అని అలేఖ్య తనకు చెప్పినట్టు ఆయన తెలిపారు. ‘కలియుగం అంతమై.. సత్యయుగం వస్తుందని అలేఖ్య అనేది. కరోనా కూడా ఇందుకు ఒక సూచిక అని చెప్పేది“ అని పురుషోత్త‌మ‌నాయుడు పోలీసుల‌కు వివ‌రించారు.

వైజాగ్ మెంట‌ల్ ఆస్ప‌త్రికి!
పురుషోత్తం, పద్మజ దంప‌తుల మాన‌సిక ప‌రిస్థితి దారుణంగా ఉండ‌డంతో విశాఖలోని ప్రభుత్వ మానసిక చికిత్స కేంద్రానికి త‌ర‌లించారు. తిరుపతిలోని రుయా మానసిక వైద్యనిపుణుల సిఫార్సుతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. ఈ స‌మ‌యంలో కూడా పద్మజ మంత్రాలు పఠిస్తూ.. ‘నా బిడ్డలు తిరిగి వస్తున్నారు. ఇంటికి వెళ్లాలి. జైలులో తోడుగా ఉన్న శివుడు, కృష్ణయ్య ఇక్కడ కనిపించడం లేదు’ అంటూనే వైద్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. పురుషోత్తంనాయుడు ఏడుస్తూ వైద్యులతో మాట్లాడడం అంద‌రినీ కంట‌త‌డి పెట్టించింది. ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించి.. స‌మాజానికి గురువులుగా మారి.. వంద‌ల మంది విద్యార్థుల‌ను తీర్చిదిద్దిన ఈ దంప‌తుల‌కు అస‌లు ఏమైంది? ఎందుకిలా మారిపోయారు? మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌లుగా ఉన్న వీటికి స‌మాధానం దొర‌క‌డం లేదు.