Political News

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి సీన్ ఇంత రివ‌ర్సా… ?

నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌మ‌కు కంచుకోట‌గా ఉంద‌ని భావించిన పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి పుంగ‌నూరుకు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉంది. దీంతో ఏ పార్టీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. పుంగ‌నూరులో పెద్దిరెడ్డి రాజ‌కీయాలే కొన‌సాగుతున్నాయి. అయితే తాజాగా ఇక్క‌డ టీడీపీ పాగా వేసింది. నామినేష‌న్ల ఘ‌ట్టం నుంచే ర‌గిలిపోయిన ఈ ప్రాంతం.. చివ‌ర‌కు వైసీపీ నామినేష‌న్ల‌ను వేసేది లేద‌ని తేల్చేసింది. దీంతో ఇక్క‌డ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది.

అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. పుంగ‌నూరులో వైసీపీకి హ‌వా త‌గ్గింద‌నే చెప్పాలి. ఇక‌, పెద్దిరెడ్డి రాజ‌కీయాల విష‌యానికి వ‌చ్చినా.. పుంగ‌నూరులో పెద్ద‌గా ఆయ‌న ప‌ట్టు క‌నిపించ‌డం లేదు. నిజానికి చాలా ఏళ్లుగా ఇక్కడ చ‌క్రం తిప్పుతున్న ఆయ‌న‌కు ఇప్పుడు టీడీపీ స‌హా మ‌రో రెండు పార్టీల‌కు చెందిన నాయ‌కుల నుంచి ప్ర‌భావం క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా రెండు అంశాలు పుంగ‌నూరులో ప్ర‌భావం చూపిస్తున్నాయ‌ని అంటున్నారు. ఈ కార‌ణంగానే పెద్దిరెడ్డి హ‌వాకు బ్రేకులు ప‌డుతున్నాయ‌ని చెబుతున్నారు.

  1. నియంతృత్వం: పుంగ‌నూరు అంటే పెద్దిరెడ్డి అనే మాటే వినిపిస్తుంది. గ‌త ఎన్నిక‌ల స‌మయంలోనూ ఇదే క‌నిపించింది. అయితే.. మారుతున్న ప్ర‌జ‌ల దృష్టి.. వారి ఆకాంక్ష‌ల‌ను పెద్దిరెడ్డి ప‌ట్టించుకోక‌పోగా.. త‌మ ధోర‌ణినే ప్ర‌జ‌ల‌పై రుద్దుతున్నారు. ఇది అంతిమంగా తిరుగుబాటుకు కార‌ణంగా మారుతోంది. ప్ర‌జ‌ల్లోనూ మార్పు దిశ‌గా ఆలోచ‌న‌లు వ‌స్తున్నాయి. ఇదే.. తాజాగా స్థానిక ఎన్నిక‌ల్లో క‌నిపిస్తోంది. తొలిరోజే ర‌ణ‌రంగంగా మారినా ప్ర‌జ‌లు పెద్గగా ప‌ట్టించుకోలేదు. పెద్దిరెడ్డి ఫ్యామిలీపై సానుభూతి కూడా చూపించ‌లేదు.
  2. బ‌ల‌మైన ప్ర‌త్యామ్నాయం: ఆది నుంచి కూడా పెద్దిరెడ్డి వైఖ‌రిపై అనేక విమ‌ర్శ‌లు ఉన్నాయి. అంతా త‌మదే అన్న ధోర‌ణి కూడా క‌నిపిస్తోంది. వైసీపీ అయినా.. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ అయినా పెద్దిరెడ్డి త‌న వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. ఫ‌లితంగా నిన్నటి వ‌ర‌కు బ‌ల‌మైన ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డంతో పెద్దిరెడ్డి హ‌వాకు తిరుగు లేకుండా పోయినా.. ఇప్పుడు బ‌ల‌మైన నాయ‌కులు.. పార్టీలు కూడా పుంగ‌నూరులో పాగా వేశాయి. ముఖ్యంగా రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌పై పెద్దిరెడ్డి ఒత్తిడి ఇప్పుడు తిరుగుబాటుకు కార‌ణంగా మారింది. మొత్తంగా ఇక్క‌డంగా పెద్దిరెడ్డి స్వ‌యం కృత‌మేన‌ని పెద్ద‌గా చెప్ప‌డానికి ఏమీలేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

This post was last modified on October 21, 2026 8:57 am

Share

Recent Posts

‘ఈసారి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే గెలిచినా… నా రాజకీయ సన్యాసమే’

వైసీపీ నాయ‌కులు వెంక‌ట‌న్నా అని పిలుచుకునే అనంత‌పురం వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి తాజాగా పెద్ద…

56 minutes ago

అమెరికాలో SBI గ్రాండ్ ఎంట్రీ..

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  శుభవార్త అందించింది. తమ అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో అమెరికాలోని…

1 hour ago

ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి పొలిటికల్ స్కెచ్

తెలంగాణాలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయతీరానికి చేర్చడంలో సఫలం అయిన…

1 hour ago

సోషల్ మీడియా లేకపోవడం మా అదృష్టం: నాగార్జున

ఒకప్పుడు సోషల్ మీడియా లేకపోవడం తాము అదృష్టవంతులమని సీనియర్ హీరో అక్కినేని నాగార్జున అన్నాడు. ‘ఇట్లు అర్జున’ సినిమాతో హీరోగా…

2 hours ago

తన పార్టీ ఏదో చెప్పేసిన జగపతి

తెలుగు సినీ పరిశ్రమలో రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్లు బోలెడంతమంది ఉన్నారు. వారిలో కొందరు నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెడితే.. మిగతా…

3 hours ago

ముందే బరువు తగ్గాల్సింది – ఎన్టీఆర్

కెరీర్ ఆరంభంలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండేదో అభిమానులకు గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్లో హీరోలు మెయింటైన్ చేసే స్టాండర్డ్స్‌తో…

5 hours ago