Political News

టోల్ ప్లాజా దగ్గర ఐఏఎస్ రచ్చ

మన దేశంలో టోల్ ప్లాజాల దగ్గర ప్రోటోకాల్ పంచాయతీలకు కొదవే లేదు. కొందరు రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు..ఇలా నిర్దేశించిన కొంతమంది వాహనాలకు మాత్రమే టోల్ రుసుము మినహాయింపు ఉంటుంది. అయితే, కొందరు పొలిటిషియన్లు మాత్రం ప్రెస్టీజ్ కు పోయి తమకు కూడా టోల్ ఫ్రీ అంటూ టోల్ గేట్ సిబ్బందితో వాదనలకు దిగుతుంటారు.

టోల్ చెల్లించే డబ్బులు వాళ్ల దగ్గర లేక కాదు. అదంతా ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం. అదే కేటగిరీలో గతంలో విజయవాడ దగ్గర కాజా టోల్ ప్లాజా దగ్గర వైసీపీ మహిళా నేత దేవండ్ల రేవతి చేసిన రచ్చ అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అదే తరహాలో తాజాగా విజయవాడలోని వెస్ట్ బైపాస్ వద్ద వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద సీఎంవో సెక్రటరీ, ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా చేసిన గొడవ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

ప్రతి టోల్ ప్లాజా, టోల్ గేట్ దగ్గర ఎవరెవరికి మినహాయింపు ఉంది అన్న విషయం పేద్ద బోర్డుపై స్పష్టంగా రాసి ఉంటుంది. అయితే, కార్తికేయ మిశ్రా ఆ బోర్డు సరిగా చదవలేదో..చదివినా ఐ కెన్ బ్రేక్ ది రూల్స్ అనుకున్నారో తెలియదుగానీ…తనను టోల్ ఫీజు అడిగిన సిబ్బంది తోలు తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. సీఎంవో సెక్రటరీని నన్నే టోల్ అడుగుతావా అంటూ గద్గద స్వరంతో అక్కడి సిబ్బందితో వాదనకు దిగారు. వాస్తవానికి కలెక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు బాస్ ర్యాంక్ ఉన్న ఏపీ చీఫ్ సెక్రటరీకి మాత్రమే టోల్ ఫీజు మినహాయింపు ఉందని సిబ్బంది చెబుతున్నా ఆయన వినకుండా చిందులు తొక్కారు.

కార్తికేయ వీరావేశం చూసిన తర్వాత నేషనల్ హైవే అథారిటీ అధికారులు అక్కడికి చేరుకొని ఆయనను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినా సరే, ఆయన వినకుండా సదరు సెక్యూరిటీ గార్డును సస్పెండ్ చేయాలని రచ్చ రచ్చ చేశారు. పొరాపాటు జరిగిందని, క్షమాపణ చెప్పినా సరే వినకుండా నానా యాగీ చేశారు. దీంతో అక్కడి సిబ్బందిని సస్పెండ్ చేశారన్న వార్త సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి సీఎంవో వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో కూడా పలుమార్లు ఆయన తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు.

This post was last modified on November 28, 2026 3:17 pm

Share

Recent Posts

పిలవని పేరంటానికి వస్తే పోలీస్ కేసు

పెళ్లిళ్లకు ఆహ్వానం లేకుండానే వెళ్లి విందు భోజనాలు చేసే వారికి తెలంగాణలోని వనపర్తిలో ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం గట్టి…

1 hour ago

ఇడుపు కాయితం… ఆంధ్రాలో కొంచం డౌట్?

ఈ మధ్య తెలుగులో ఒక ప్రాంతానికి సంబంధించిన రూటెడ్ కథలు తరచుగా వస్తుండగా, వాటికి ఆయా ప్రాంతాల్లోనే ఆదరణ దక్కుతుండడం..…

1 hour ago

దాదా రెండో ఆప్షన్ వైపు చూస్తున్నాడా

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త చర్చ మొదలయ్యింది. డిసెంబర్ 24 విడుదల కావాల్సిన దాదా ఇప్పుడు సంక్రాంతి వైపు చూస్తుందనేది…

3 hours ago

బాబీ ఇంత పట్టుదలగా ఎందుకున్నట్టు

దర్శకుడు బాబీ కొల్లి పట్టువదలని విక్రమార్కుడిగా మారిపోయారు. కాకాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని కంకణం కట్టుకుని, చిరంజీవి…

4 hours ago

కొడాలి యాక్టివ్ అయ్యారు.. వైసీపీ గ్రీన్‌సిగ్న‌ల్‌.. !

గుడివాడ మునిసిప‌ల్ ఎన్నిక‌లు ఈ నెల 26న జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌ర‌ఫున మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్…

4 hours ago

అమరావతిపై విషం కక్కుతోన్న వైసీపీ

రాష్ట్రానికి తలమానికంగా నిర్మాణం జరుపుకుంటున్న అమరావతి రాజధాని విషయంలో వైసీపీ విషం కక్కుతోందని, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులకు…

4 hours ago