Movie News

వృషకర్మ అంచనాలకు మించి ఉండాల్సిందే

వచ్చే వారం విడుదల కాబోతున్న వృషకర్మ మీద నాగచైతన్య అభిమానులు పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. తమ్ముడు అఖిల్ లెనిన్ తో సక్సెస్ దారిలో పడ్డాడు. గత ఏడాది తండేల్ తో సూపర్ హిట్ అందుకున్న చైతు దాన్ని కొనసాగించేలా ఈసారి ఫాంటసీ థ్రిల్లర్ సబ్జెక్టు ఎంచుకోవడంతో హైప్ పెరిగింది. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహించిన వృషకర్మలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చారు. హైప్ పెంచడానికి ట్రైలర్ దోహదపడింది.

బ్లాక్ బస్టర్ కొడతామనే నమ్మకం టీమ్ లో బలంగా ఉంది. ఇవాళ జరిగిన హైదరాబాద్ ప్రెస్ మీట్ లో స్టేట్ మెంట్స్ వింటే ఎంత ఊహించుకున్నా తప్పు లేదనిపిస్తోంది. మొదటి పది నిముషాలు మిస్ అయిపోతే ఫ్లో తప్పిపోతారని దర్శకుడు కార్తీక్ ముందే హిట్ ఇస్తున్నారు. చివరి ముప్పావు గంట మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటుందని, తండేల్ సాధించిన వంద కోట్లను ఈజీగా బీట్ చేసేలా వృషకర్మ రూపొందుతోందని చైతు హామీ ఇచ్చాడు. ఒక్కొక్కరు వ్యక్తపరుస్తున్న నమ్మకం పీక్స్ లో ఉంది.

కెరీర్ లో మొదటిసారి 8 గంటల నెరేషన్ రెండు రోజుల పాటు విన్నానని మీనాక్షి చౌదరి చెప్పడం చూస్తుంటే కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్న సంకేతం కనిపిస్తోంది. ఉన్న బడ్జెట్ లోనే బెస్ట్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ రాబట్టుకున్నామని, ఏడాది నుంచి ఆ పనులు జరుగుతున్నాయని చైతు చెప్పడం ద్వారా క్వాలిటీ మీద ఎంత దృష్టి పెట్టారో అర్థమవుతోంది. సుకుమార్ స్టాంప్ కూడా ఉంది కాబట్టి అంత ఆషామాషీగా వృషకర్మ ఉండబోవడం లేదనే స్పష్టత వచ్చేసింది.

సెన్సార్ వైపు నుంచి ఒక రెండు మూడు సన్నివేశాల్లో ఉన్న హింసని తగ్గించమనే సూచనలు వచ్చాయట. ప్యాన్ ఇండియా లెవెల్ లో వృషకర్మ కనక వర్కౌట్ అయితే లాల్ సింగ్ చద్దా టైంలో బాలీవుడ్ ఎంట్రీని సరిగా చేయలేకపోయిన చైతుకి వృషకర్మ రూపంలో పెద్ద రిలీఫ్ దక్కుతుంది. పోటీలో అలియాస్ రుక్మిణి ఉన్నప్పటికీ జానర్లు బడ్జెట్లు రెండు వేరు కాబట్టి కాంపిటీషన్ పరంగా టెన్షన్ లేదు. బాలీవుడ్ మార్కెట్ లో శ్రద్ధ కపూర్ ఈషా ఒకటే ఉంది. చూడాలి వృషకర్మ ఫలితం ఎలా ఉండబోతోందో.  

This post was last modified on November 28, 2026 3:54 pm

Share

Recent Posts

టోల్ ప్లాజా దగ్గర ఐఏఎస్ రచ్చ

మన దేశంలో టోల్ ప్లాజాల దగ్గర ప్రోటోకాల్ పంచాయతీలకు కొదవే లేదు. కొందరు రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు..ఇలా నిర్దేశించిన కొంతమంది…

43 minutes ago

పిలవని పేరంటానికి వస్తే పోలీస్ కేసు

పెళ్లిళ్లకు ఆహ్వానం లేకుండానే వెళ్లి విందు భోజనాలు చేసే వారికి తెలంగాణలోని వనపర్తిలో ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం గట్టి…

2 hours ago

ఇడుపు కాయితం… ఆంధ్రాలో కొంచం డౌట్?

ఈ మధ్య తెలుగులో ఒక ప్రాంతానికి సంబంధించిన రూటెడ్ కథలు తరచుగా వస్తుండగా, వాటికి ఆయా ప్రాంతాల్లోనే ఆదరణ దక్కుతుండడం..…

2 hours ago

దాదా రెండో ఆప్షన్ వైపు చూస్తున్నాడా

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త చర్చ మొదలయ్యింది. డిసెంబర్ 24 విడుదల కావాల్సిన దాదా ఇప్పుడు సంక్రాంతి వైపు చూస్తుందనేది…

4 hours ago

బాబీ ఇంత పట్టుదలగా ఎందుకున్నట్టు

దర్శకుడు బాబీ కొల్లి పట్టువదలని విక్రమార్కుడిగా మారిపోయారు. కాకాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని కంకణం కట్టుకుని, చిరంజీవి…

4 hours ago

కొడాలి యాక్టివ్ అయ్యారు.. వైసీపీ గ్రీన్‌సిగ్న‌ల్‌.. !

గుడివాడ మునిసిప‌ల్ ఎన్నిక‌లు ఈ నెల 26న జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌ర‌ఫున మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్…

5 hours ago