Political News

అమరావతిపై విషం కక్కుతోన్న వైసీపీ

రాష్ట్రానికి తలమానికంగా నిర్మాణం జరుపుకుంటున్న అమరావతి రాజధాని విషయంలో వైసీపీ విషం కక్కుతోందని, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులకు ఫిర్యాదులు చేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో వైసీపీ మొదట్నుంచి వ్యతిరేకంగానే వుంది. రాష్ట్ర ప్రయోజనాలకంటే కూడా వ్యక్తిగత భేషజాలకే వైసీపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా నష్టం జరిగినా పర్వాలేదు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం పేరు రాకూడదన్న అక్కసుతో వ్యవహారిస్తుంది. రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను సైతం లెక్క చేయడం లేదు. 

అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన ఆర్ధిక వనరుల సేకరణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకును, ఆసియా అభివృద్ధి బ్యాంకులను మెప్పించి, ఒప్పించి రుణాలు తీసుకొని వస్తున్నారు. రాజధాని నిర్మాణం ఇష్టం లేని వైసీపీ రుణాలు రాకుండా మోకాలడ్డే ప్రయత్నం చేస్తోంది. 2014 -19 మధ్యలో కూడా తనకు వంతపాడే వ్యక్తుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు చేయించింది. అప్పుడు కొంతమేర సఫలం అయ్యింది కూడా. 

పాత అనుభవాలను దృష్టిలో వుంచుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 2024 లో మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత అమరావతి నిర్మాణం పనుల్లో వేగం పెంచారు. ఎక్కడా, ఎలాంటి అవాంతరాలు, ఆటంకాలు ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత చర్యలు తీసుకున్నారు. దాంతో వైసీపీకి ఏమి చేయాలో తోచడం లేదు. వైసీపీ నేపథ్యం ఉన్న కొందరు వ్యక్తులు, రైతు సంఘాల ప్రతినిధుల ద్వారా ప్రపంచ బ్యాంకు , ఆసియా అభివృద్ధి బ్యాంకులకు పరంపరగా ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టింది. 

రైతులను బెదిరించి  బలవంతంగా భూసమీకరణ  చేశారని, భూములిచ్చిన రైతులకు సరైన పరిహారం అందించలేదని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు వల్ల స్థానిక ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆరోపించారు. నిర్మాణ కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారని, రైతులతో సరైన సంప్రదింపులు జరపకుండా కీలక సమాచారాన్ని గోప్యంగా ఉంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో ఇటీవల ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సంయుక్త ప్రతినిధుల బృందం నవంబర్ చివరి వారంలో అమరావతిలో పర్యటించింది. రాజధాని నిర్మాణ పనుల వేగం, నాణ్యత, పర్యావరణ ప్రమాణాలు,  రైతుల సమస్యల పరిష్కార తీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన ప్రతినిధుల బృందం తదుపరి  నిధుల విడుదలకు సానుకూలత వ్యక్తం చేశారు. 

అదే విషయాన్ని తాజాగా జరిగిన  కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు.  రాష్ట్రానికి అమరావతి లాంటి నగరాలు రావడం  వైసీపీకి ఇష్టం లేదని మండిపడ్డారు. జగన్ అండ్ కో అమరావతిపై పగబట్టారని,  రైతులు చేసిన త్యాగాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజధాని అమరావతిపై వైసీపీకి చెందిన వ్యక్తులు అదే పనిగా ప్రపంచ బ్యాంక్, ఏడీబీకి ఫిర్యాదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కే పరిమితం చేస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు.

This post was last modified on November 28, 2026 11:21 am

Share

Recent Posts

బాబీ ఇంత పట్టుదలగా ఎందుకున్నట్టు

దర్శకుడు బాబీ కొల్లి పట్టువదలని విక్రమార్కుడిగా మారిపోయారు. కాకాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని కంకణం కట్టుకుని, చిరంజీవి…

5 minutes ago

కొడాలి యాక్టివ్ అయ్యారు.. వైసీపీ గ్రీన్‌సిగ్న‌ల్‌.. !

గుడివాడ మునిసిప‌ల్ ఎన్నిక‌లు ఈ నెల 26న జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌ర‌ఫున మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్…

21 minutes ago

ఆ రోజు చిరు బీర్ తాగి ఉంటే..?

చిరంజీవి గురించి సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ కొన్ని వీడియోలు అవీ పోస్ట్ చేస్తూ.. ఒక టెంప్లేట్ కామెంట్ పెడుతుంటారు.…

1 hour ago

5 నెలలు ఆలస్యంగా తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ రెండు సంచలన విషయాలను వెల్లడించారు. ఒకటి... జమిలీ ఎన్నికలు జరగడం ఖాయమని తేల్చి చెప్పేశారు. రెండు...జమిలీ…

3 hours ago

ఇలా చేస్తే ఇక కాపీలు కొట్టలేరు

పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టేందుకు చైనా సరికొత్త విధానాన్ని అమలు చేస్తోందంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. పరీక్ష…

10 hours ago

ఎన్విడియా సీఈఓను కాపాడింది నేనే: కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఎన్విడియా…

14 hours ago