బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ రెండు సంచలన విషయాలను వెల్లడించారు. ఒకటి… జమిలీ ఎన్నికలు జరగడం ఖాయమని తేల్చి చెప్పేశారు. రెండు…జమిలీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయని స్పష్టం చేశారు. ఈ రెండూ విషయాలు తెలంగాణా రాజకీయాలను ఒక కుదుపు కుదిపాయనే చెప్పొచ్చు.
ప్రస్తుత అసెంబ్లీకి 2028 డిసెంబర్ 8 వరకు కాలపరిమితి ఉంది. షెడ్యూల్ ప్రకారం 2028 డిసెంబర్ నెలలో తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. కానీ ఐదు నెలలు ఆలస్యంగా 2029 మార్చి, ఏప్రిల్‌లో జరిగే అవకాశం వుందని ఎంపీ లక్ష్మణ్ చెబుతున్నారు. మరి అసెంబ్లీ గడువు తీరుతుంది కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేసే అవకాశం వుందని తేల్చి చెప్పారు. లోక్ సభ ఎన్నికలకు ఏడాది ముందు, ఏడాది తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నిటికీ ఒకేసారి 2029 లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
బీజేపీలో లక్ష్మణ్ సాధారణ నాయకుడు కాదు బీజేపీ. పార్లమెంటరీ బోర్డు సభ్యుడు. అంటే బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకునే సభ్యుల్లో ముఖ్యుడు. ఆయనే స్వయంగా తెలంగాణా ఎన్నికల వాయిదా గురించి ప్రకటించారు. అంతేకాదు.. డీ లిమిటేషన్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను తప్పు పట్టారు. జనాభాకు అనుగుణంగా డీలిమిటేషన్ వద్దంటూ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే జనాభా ప్రతిపాదిక ప్రకారమే డీ లిమిటేషన్ చేయాలని ఉత్తర భారత ప్రజలు ఆందోళనకు దిగితే ఏమి చేస్తామని ప్రశ్నించారు. జీడీపీ ఆధారంగా డీలిమిటేషన్ చేయాలన్న డిమాండ్ కూడా సరైంది కాదన్నారు. జీడీపీ ప్రతి ఏడాది మారుతుందని, అప్పుడు ఏడాదికొకసారి డీ లిమిటెషన్ చేయాల్సి వస్తుందన్నారు.
ఉత్తరాది, దక్షిణాది అని మనం తారతమ్యాలు సృష్టించడం సమర్ధనీయం కాదన్న ఎంపీ లక్ష్మణ్ ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అక్కడ కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రానికి ఒక ఎంపీ మాత్రమే వున్నారని గుర్తు చేశారు. డిసెంబర్ వరకు డీ లిమిటెషన్ బిల్లు పాస్ కాకపొతే అప్పుడు జనాభా ప్రతిపాదిక ప్రకారం చేయాల్సిన వస్తుందని తెలిపారు. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న భావం ఆయన మాటల్లో వ్యక్తం అయ్యింది.
This post was last modified on November 28, 2026 8:46 am
చిరంజీవి గురించి సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ కొన్ని వీడియోలు అవీ పోస్ట్ చేస్తూ.. ఒక టెంప్లేట్ కామెంట్ పెడుతుంటారు.…
పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టేందుకు చైనా సరికొత్త విధానాన్ని అమలు చేస్తోందంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. పరీక్ష…
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఎన్విడియా…
రెండు కంటెంట్ ఉన్న సినిమాలు ఒకేరోజు రిలీజవుతున్నప్పుడు ఆయా హీరోల అభిమానుల మధ్య మాది గొప్పంటే మాది గొప్పంటూ ఆన్…
2027 సంక్రాంతి బాక్సాఫీస్ పోటీకి సంబంధించి మెల్లగా మబ్బులు వీడుతున్నాయి. ప్రమోషన్ల పరంగా ఒకరు ముందు, ఒకరు వెనుకా ఉన్నప్పటికీ…
రామ్ చరణ్ 17 కోసం అడుగులు మొదలయ్యాయి. పూజా కార్యక్రమాలు ఆల్రెడీ చేసినప్పటికీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. డిసెంబర్…