Movie News

పోటీ మధ్యలో నలిగిపోయిన నాన్న

నిన్న విడుదలైన సినిమాల్లో కొంచెం ఎక్కువ అటెన్షన్ తీసుకున్నది భోగినే అయినా దాంతో పాటు అయిదారు చిన్న చిత్రాలు బాక్సాఫీస్ ని పలకరించాయి. వాటిలో విజయ్ ఆంటోనీ నాన్న కుట్టి ఒకటి. వారం క్రితం తమిళంలో అప్పాకుట్టిగా రిలీజైన ఈ ఎమోషనల్ డ్రామాని మన దగ్గర వన్ వీక్ గ్యాప్ తో తీసుకొచ్చారు. హీరో హీరోయిన్ హైదరాబాద్ వచ్చి రోడ్ల మీద, రెస్టారెంట్లలో, మెట్రో ట్రైన్స్ లో ప్రత్యక్షంగా ప్రమోషన్లు చేశారు. ఆడియన్స్ లో వీలైనంత బజ్ తీసుకొచ్చేందుకు ఎంత చేయాలో అంతా చేశారు.

అయితే నాన్నకుట్టికి సరైన థియేటర్లు దొరక్కపోవడమే కాదు షోలు కూడా తక్కువగానే పడినట్టుగా కనిపిస్తోంది. పాప సెంటిమెంట్ ప్రధానాంశంగా రూపొందిన నాన్న కుట్టిలో ప్రీతీ అస్రాని జోడిగా నటించింది. ఊటీలో పాపే ప్రాణంగా బ్రతికే ఒక తండ్రి కథ ఇది. జీవితం అలా గడిచిపోతున్న టైంలో పాపకు ప్రాణాంతక వ్యాధి ఉన్నట్టు బయటపడటమే కాక అతను అసలు తండ్రి కాదనే నిజం ప్రపంచానికి తెలుస్తుంది. వ్యవహారం కోర్టుకు చేరుతుంది. చివరికి ఏమయ్యిందనేది తెరమీద చూడాల్సిన స్టోరీ.

దర్శకుడు మారన్ తీసుకున్న పాయింట్ లో కొంత వైవిధ్యం ఉన్నప్పటికీ ట్రీట్ మెంట్ సరిగా లేకపోవడం వల్ల నాన్న కుట్టి ఆశించినంత వేగంగా వెళ్ళదు. స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా సాగడం ఒక లోపం కాగా ఎమోషన్స్ లో డ్రామా ఎక్కువైపోవడంతో ల్యాగ్ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. విజయ్ ఆంటోనీ మీద బిచ్చగాడు తరహా భావోద్వేగాలే వర్కౌట్ అవుతాయని భావిస్తున్న దర్శకులు ఆయన్ని అదే తరహా డ్రామాలో చూపించే ప్రయత్నం చేయడం వల్ల అవసరానికి మించి సాగతీత వస్తోంది.

రివ్యూలు, టాక్ సంగతి పక్కనపెడితే కాంపిటీషన్ మధ్య నాన్న నలిగిపోయిన మాట వాస్తవం. హిట్టు కోసం ఏళ్ళ తరబడి యుద్ధం చేస్తున్న విజయ్ ఆంటోనీకి అది ఎంతకీ దక్కని ద్రాక్ష పండులా అయిపోయింది. ఆకాశంలో ఒక తార, ఈ నగరానికి ఏమైంది రిపీట్ పాజిటివ్ టాక్ తో రెండో వారంలోనూ బలంగా ఉండటం వల్ల కొత్త వాటికి ఎక్కువ స్పేస్ లేకుండా పోయింది. భోగికి రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా దాని వల్ల నాన్న కుట్టి లాంటి వాటికి కలిగే ప్రయోజనం పెద్దగా ఉండటం లేదు. 

This post was last modified on November 28, 2026 4:29 pm

Share

Recent Posts

వృషకర్మ అంచనాలకు మించి ఉండాల్సిందే

వచ్చే వారం విడుదల కాబోతున్న వృషకర్మ మీద నాగచైతన్య అభిమానులు పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. తమ్ముడు అఖిల్…

54 minutes ago

టోల్ ప్లాజా దగ్గర ఐఏఎస్ రచ్చ

మన దేశంలో టోల్ ప్లాజాల దగ్గర ప్రోటోకాల్ పంచాయతీలకు కొదవే లేదు. కొందరు రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు..ఇలా నిర్దేశించిన కొంతమంది…

2 hours ago

పిలవని పేరంటానికి వస్తే పోలీస్ కేసు

పెళ్లిళ్లకు ఆహ్వానం లేకుండానే వెళ్లి విందు భోజనాలు చేసే వారికి తెలంగాణలోని వనపర్తిలో ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం గట్టి…

3 hours ago

ఇడుపు కాయితం… ఆంధ్రాలో కొంచం డౌట్?

ఈ మధ్య తెలుగులో ఒక ప్రాంతానికి సంబంధించిన రూటెడ్ కథలు తరచుగా వస్తుండగా, వాటికి ఆయా ప్రాంతాల్లోనే ఆదరణ దక్కుతుండడం..…

3 hours ago

దాదా రెండో ఆప్షన్ వైపు చూస్తున్నాడా

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త చర్చ మొదలయ్యింది. డిసెంబర్ 24 విడుదల కావాల్సిన దాదా ఇప్పుడు సంక్రాంతి వైపు చూస్తుందనేది…

5 hours ago

బాబీ ఇంత పట్టుదలగా ఎందుకున్నట్టు

దర్శకుడు బాబీ కొల్లి పట్టువదలని విక్రమార్కుడిగా మారిపోయారు. కాకాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని కంకణం కట్టుకుని, చిరంజీవి…

5 hours ago