Movie News

వాహ్… విదేశీ గాయకుల నోట అన్నమయ్య పాట!

విదేశాల్లో ఎక్కడైనా బహిరంగ వేదికల మీద తెలుగు పాట వినిపిస్తే ఆశ్చర్యం ఏమి కలగట్లేదు ఇప్పుడు. గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచం ఒక కుగ్రామంలా మారిపోయి.. అందరికీ అన్ని సంస్కృతులూ పరిచయం అవుతున్నాయి. ఐతే ఒక తెలుగు తెలుగు సంగీతకారుడు రాసిన పాటను విదేశీ మ్యూజిక్ ట్రూప్ ఒక పెద్ద వేదిక మీద పెర్ఫామ్ చెయ్యడం మాత్రం కచ్చితంగా విశేషమే.

పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ప్రసిద్ధ సంకీర్తన ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే’ విదేశీ గాయకుల గళాల్లో వినిపించడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశం అయింది. అది కూడా భారతీయులు బాగా ఎక్కువగా ఉండే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా కాదు. స్విట్జర్లాండ్‌లో ఈ విశేషం చోటుచేసుకుంది.

స్విస్ లో తాజాగా నిర్వహించిన సోల్స్‌బర్గ్ ఫెస్టివల్–2026లో ప్రముఖ గాయక బృందం ‘చాంటిక్లీర్’ అన్నమయ్య కీర్తనను ఆలపించింది. అన్నమయ్య ఎన్నో అద్భుతమైన కీర్తనలు రూపొందించగా.. అందులో బ్రహ్మమొక్కటే చాలా ప్రత్యేకం. మనుషులంతా ఒక్కటే అనే విషయాన్ని చాలా సరళమైన మాటలతో పండిత పామరులకు అర్థమయ్యేలా చాలా గొప్పగా ఈ కీర్తనను తీర్చిదిద్దారు అన్నమయ్య.

శతాబ్దాల క్రితం అన్నమయ్య రచించిన ఈ కీర్తనలోని ఆధ్యాత్మిక భావం, భక్తి సందేశాన్ని గుర్తించి విదేశీ గాయకులు ఆ పాటను పెర్ఫామ్ చేస్తుంటే చూడడం గొప్ప అనుభూతిని ఇస్తోంది. తెలుగు నేలపై పుట్టిన అన్నమయ్య స్వరపరిచిన కీర్తన అంతర్జాతీయ వేదికపై వినిపించడం తెలుగు వారందరికీ మరోసారి గర్వకారణం అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on November 28, 2026 6:01 pm

Share

Recent Posts

స్టేజ్ మీద స్టేట్మెంట్లు… బోయపాటి గడగడ

తమ సినిమా గురించి అందరూ పాజిటివ్ గానే చెప్పుకోవడం సహజం. కానీ జస్ట్ సినిమా బావుంటుందని చెప్పుకుంటే అది జనాల…

6 minutes ago

ఓహో… ఇలా కూడా ప్రచారం చేయొచ్చా?

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంటింటి ప్రచారాలు, కరపత్రాల పంపిణీ, మైక్ ప్రచారం ఇప్పుడు పాత…

1 hour ago

ఎన్ని జిల్లాల్లో వైసీపీ ఉనికిని చాటుకుంది?

స్థానిక ఎన్నికలలో వైసీపీ ప్రభావం అనేక జిల్లాల్లో నామమాత్రంగా కనిపించింది. మున్సిపల్, కార్పొరేషన్, పరిషత్ ఎన్నికల్లో కూటమి ముందు నిలబడేందుకు,…

2 hours ago

శర్వా గుండెల్లో ‘భోగి’ మంటలు

నిన్న విడుదలైన భోగికి వస్తున్న టాక్ చూసి శర్వానంద్ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. కనీసం యావరేజ్ అన్నా ఏదో అనుకోవచ్చు…

3 hours ago

పోటీ మధ్యలో నలిగిపోయిన నాన్న

నిన్న విడుదలైన సినిమాల్లో కొంచెం ఎక్కువ అటెన్షన్ తీసుకున్నది భోగినే అయినా దాంతో పాటు అయిదారు చిన్న చిత్రాలు బాక్సాఫీస్…

4 hours ago

వృషకర్మ అంచనాలకు మించి ఉండాల్సిందే

వచ్చే వారం విడుదల కాబోతున్న వృషకర్మ మీద నాగచైతన్య అభిమానులు పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. తమ్ముడు అఖిల్…

5 hours ago