సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో ఆయన తనయుడు మహేష్ బాబు మాత్రమే పెద్ద స్టార్ అయ్యాడు. మిగతా ఎవ్వరూ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు. రమేష్ బాబు కొన్నేళ్లు గట్టిగానే ప్రయత్నించాడు కానీ.. తర్వాత ఫేడవుట్ అయిపోయాడు. మంజుల హీరోయిన్ అవుదామని ప్రయత్నించినా కుదరలేదు.
తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మాయమైంది. సుధీర్ బాబు గట్టిగానేట్రై చేశాడు, చేస్తున్నాడు కానీ.. ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. ఇక ఈ కుటుంబం నుంచి వచ్చి మూడో తరం వారసుల్లో మొదటి వాడు అశోక్ గల్లా. అతను మహేష్ అక్క పద్మావతి, ప్రముఖ పారిశ్రామికవేత్త జయదేవ్ గల్లా తనయుడు.
కొన్నేళ్ల ముందు ‘హీరో’ చిత్రంతో అరంగేట్రం చేశాడు. కానీ మంచి ప్యాడింగ్ పెట్టుకుని చేసిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ‘దేవకీ నందన వసుదేవ’ అనే సినిమా చేస్తే అది రిలీజైన సంగతి కూడా జనాలకు పెద్దగా తెలియదు. మూడో ప్రయత్నంగా సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్లో ‘వీసా’ అనే సినిమా చేశాడు కానీ.. అది ఎంతకీ విడుదలకు నోచుకోవడం లేదు.
మొత్తంగా ఇప్పటి వరకైతే అశోక్ గల్లా సినీ ప్రయాణం ఏమంత ఆశాజనకంగా లేదు. ఇలాంటి టైంలో అతను ఒక క్రేజీ సీక్వెల్లో హీరోగా మారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా టైంలో సర్ప్రైజ్ హిట్‌గా నిలిచిన ‘హుషారు’కు ఇటీవలే సీక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అశోక్ గల్లా నటిస్తుండడం విశేషం. ఒరిజినల్ డైరెక్టర్ హర్ష కొనుగంటినే ఈ చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నాడు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తే సినిమా పెద్ద స్థాయిలోనే ఉంటుందని అర్థమైంది.
మామూలుగా సీక్వెల్స్ తీసినపుడు.. హీరోయిన్లు మారిపోతుంటారు కానీ, హీరోలు వాళ్లనే కొనసాగిస్తుంటారు. కానీ ‘హుషారు-2’కు మాత్రం ముఖ్య పాత్రధారుల్లో ఇద్దరిని మాత్రమే కొనసాగించి, ముగ్గురిని మార్చేశారు. ముఖ్యంగా మెయిన్ లీడ్ అయిన తేజస్ స్థానంలోకి అశోక్ వచ్చేశాడు. దినేశ్ తేజ్, రాహుల్ రామకృష్ణ సీక్వెల్లోనూ కొనసాగుతుండగా.. ఇంకో ఇద్దరు నటులు కూడా పక్కకు వెళ్లిపోయారు. ‘మ్యాడ్’ ఫేమ్ రవి ఆంటోనీతో పాటు ఇంకో కొత్త కుర్రాడు వారి స్థానాల్లోకి వచ్చారు. మరి ఈ మార్పులతో ప్రేక్షకులు ఎంతమేర కనెక్టవుతారో.. సీక్వెల్ ఎలాంటి ఫలితాన్నందుకుంటో చూడాలి.
This post was last modified on October 21, 2026 7:01 am
స్థానిక ఎన్నికల సమరంలో ఇప్పటి వరకు జరిగింది 25 శాతం మాత్రమే!. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరే షన్లకు మాత్రమే ఎన్నికల…
విడాకుల కేసులను గరిష్ఠంగా ఏడాదిలో పరిష్కరించాలని.. సుప్రీంకోర్టు గతంలోనే దేశంలోని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. విడాకుల కేసులలో…
నిన్న మొన్నటి వరకు తమకు కంచుకోటగా ఉందని భావించిన పుంగనూరు నియోజకవర్గం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ…
తెలంగాణలో పాలపిట్టలను విక్రయించే వారికి సీపీ సజ్జనార్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాలపిట్టలను పట్టుకున్నా.. వాటిని బంధించినా చర్యలు తప్పవని…
ఒకపక్క రజనీకాంత్ జైలర్ 2, ఇంకోవైపు ప్యాన్ ఇండియా మూవీ రణబాలి. రెండూ మంచి బజ్ తెచ్చుకున్నాయి. బడ్జెట్, బిజినెస్…
ఆయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. ఒక రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. ప్రజలకు స్ఫూర్తిగా నిలబడాల్సిన లీడర్.…