Movie News

శర్వా గుండెల్లో ‘భోగి’ మంటలు

నిన్న విడుదలైన భోగికి వస్తున్న టాక్ చూసి శర్వానంద్ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. కనీసం యావరేజ్ అన్నా ఏదో అనుకోవచ్చు కానీ సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ లో ఎక్కడ కూడా కించిత్ పాజిటివ్ ఒపీనియన్ కనిపించకపోవడం కలవరపరిచే విషయమే. ఎందుకంటే ఇదేమి చిన్న బడ్జెట్ మూవీ కాదు. కోట్లలో ఖర్చు పెట్టారు. పదుల ఎకరాల్లో సెట్స్ వేశారు. వాయిదాలు పడ్డాయి. ఖర్చులు పెరిగాయి. అడ్డంకులు వచ్చాయి. అన్ని తట్టుకుని థియేటర్లకు వస్తే ఇలాంటి పరిస్థితి ఊహించనిది.

ఇక్కడ అందరి వేళ్ళు దర్శకుడు సంపత్ నంది వైపు వెళ్తున్నాయి. హీరోయిజం ఉంటే చాలు, వందల తలలు నరుక్కుంటూ వెళ్లి, ఎమోషన్ పేరుతో ఒక రివెంజ్ డ్రామా నడిపిస్తే మాస్ జనాలు వెర్రెక్కి చూస్తారనే భ్రమలో చాలా రాంగ్ క్యాలికులేషన్లు వేసుకున్నారు. రొటీన్ కథలు రాసుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. కానీ ట్రీట్ మెంట్ వైవిధ్యంగా ఉండాలి. రంగస్థలం కూడా కనివిని ఎరుగని స్టోరీ కాదు. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో చేసిన జాతర పోలికలు కొన్ని స్పష్టంగా కనిపిస్తాయి.

కానీ సుకుమార్ విజన్, థర్డ్ క్లాస్ నుంచి బాల్కనీ దాకా అందరినీ ఎలా మెప్పించాలనే దాని మీద పెట్టిన దృష్టి రికార్డులు బద్దలయ్యే విజయాన్ని అందించాయి. సాఫ్ట్ ఇమేజ్ ఉన్న నానికి దసరా ఇచ్చేటప్పుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఇదే జాగ్రత్త పాటించారు. కానీ భోగికి సంపత్ నంది అంత ఉన్నతంగా ఆలోచించలేదు. మాస్ పేరుతో అర్థం లేని ఎలివేషన్లు, విసుగు తెప్పించే యాక్షన్ ఎపిసోడ్లతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టి ఎప్పుడు అయిపోతుందా అనిపించేశారు.

మొదటి రోజు గ్రాస్ మూడు కోట్లు కూడా దాటలేదంటే భోగికి ఎలాంటి రెసెప్షన్ దక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఒకపక్క ఆకాశంలో ఒక తారా లాంటి ఎమోషనల్ జర్నీ, ఇంకోవైపు ఈ నగరానికి ఏమైంది రిపీట్ లాంటి ట్రెండీ కామెడీతో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్న టైంలో ఇలా నరకడాలు, చంపడాలతో తెరను రక్తంతో నింపిస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు. నా కెరీర్ లోనే బెస్ట్ మూవీ భోగి అని శర్వానంద్ చాలా పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. కానీ జరుగుతున్నది చూస్తుంటే దానికి రివర్స్ అయ్యేలా ఉంది. 

This post was last modified on November 28, 2026 5:23 pm

Share

Recent Posts

స్టేజ్ మీద స్టేట్మెంట్లు… బోయపాటి గడగడ

తమ సినిమా గురించి అందరూ పాజిటివ్ గానే చెప్పుకోవడం సహజం. కానీ జస్ట్ సినిమా బావుంటుందని చెప్పుకుంటే అది జనాల…

6 minutes ago

ఓహో… ఇలా కూడా ప్రచారం చేయొచ్చా?

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంటింటి ప్రచారాలు, కరపత్రాల పంపిణీ, మైక్ ప్రచారం ఇప్పుడు పాత…

1 hour ago

ఎన్ని జిల్లాల్లో వైసీపీ ఉనికిని చాటుకుంది?

స్థానిక ఎన్నికలలో వైసీపీ ప్రభావం అనేక జిల్లాల్లో నామమాత్రంగా కనిపించింది. మున్సిపల్, కార్పొరేషన్, పరిషత్ ఎన్నికల్లో కూటమి ముందు నిలబడేందుకు,…

2 hours ago

వాహ్… విదేశీ గాయకుల నోట అన్నమయ్య పాట!

విదేశాల్లో ఎక్కడైనా బహిరంగ వేదికల మీద తెలుగు పాట వినిపిస్తే ఆశ్చర్యం ఏమి కలగట్లేదు ఇప్పుడు. గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచం…

3 hours ago

పోటీ మధ్యలో నలిగిపోయిన నాన్న

నిన్న విడుదలైన సినిమాల్లో కొంచెం ఎక్కువ అటెన్షన్ తీసుకున్నది భోగినే అయినా దాంతో పాటు అయిదారు చిన్న చిత్రాలు బాక్సాఫీస్…

4 hours ago

వృషకర్మ అంచనాలకు మించి ఉండాల్సిందే

వచ్చే వారం విడుదల కాబోతున్న వృషకర్మ మీద నాగచైతన్య అభిమానులు పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. తమ్ముడు అఖిల్…

5 hours ago