గత ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను పనిచేశాను. స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు. మీ అవసరాల కోసం. అందుకే ఏ ఒక్క స్థానంలోనూ ఓడి పోకూడదు. అన్నీ స్థానాల్లో విజయం కోసం కృషి చేయండని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాకినాడ గ్రామసభలో ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు.
బలమున్న సీట్లలో పోటీ చేస్తామని ఆమధ్య పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అవసరమైతే కూటమి పార్టీలపై ఫ్రెండ్లీ పోటీ చేయాలని కూడా సూచించిన విషయం విదితమే. కానీ ఇప్పుడు కూటమి పార్టీలు పొత్తులతోనే పోటీకి వెళతారని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో జనసైనికులు పొత్తు ప్రకారమే పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. జనసేన కోసం ఎంతగా కష్టపడతారో అంతే సీరియస్ గా టీడీపీ, బీజేపీ పార్టీల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.
2014లో ఎలాంటి పదవులు ఆశించకుండా టీడీపీ విజయం కోసం జనసైనికులు పనిచేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం స్కిల్ కుంభకోణం పేరుతో అన్యాయంగా చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టిందని చెప్పారు. అప్పుడు రోడ్ల మీదకు రావడానికి ఎవరూ ధైర్యం చేయలేదని, జనసైనికులు, వీర మహిళలు రోడ్ల మీదకు వచ్చి రాష్ట్రానికి భరోసా ఇచ్చారని చెప్పారు. ఇప్పటికే జనసేన కార్యకర్తలు, వీర మహిళలు చాలా త్యాగాలు చేశారని, ఇప్పుడు అధికార పదవులు చేపట్టే సమయం వచ్చిందని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటనతో విపక్ష వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. ఏదో ఒక వంకతో కూటమి పార్టీలు విడిపోవాలని వైసీపీ ఎదురు చూస్తుంది. కూటమి దెబ్బ ఎలా ఉంటుందో గత అసెంబ్లీ ఎన్నికల్లో రుచి చూసిన ఫ్యాన్ పార్టీ ఇప్పటికీ కోలుకోక పోతోంది. ఉత్తరాంధ్రలో అయితే ఆ పార్టీ నాయకుల వలసలతో చావో రేవో పరిస్థితిలో వుంది. నిన్నా మొన్నటి దాకా ఒంటరి పోటీ అంటూ గొప్పలు చెప్పుకున్న వైసీపీ ఇప్పుడు పొత్తుల కోసం తహతహలాడుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుల ప్రకారమే పోటీ చేస్తామని చెప్పడంతో స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం లాంఛనమే అని చెప్పొచ్చు.
This post was last modified on October 12, 2026 10:30 am
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…
సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…