సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి హీరోయిన్‌గా రాణించి.. తర్వాత వారి ఇద్దరు పిల్లలు కూడా నటులుగా మారి ప్రతిభ చాటుకోవడం అన్నది అరుదైన విషయమే. టాలీవుడ్లో ఇలాంటి కుటుంబమే శ్రీకాంత్‌ది. శ్రీకాంత్ హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ పాత్రల్లో ఆకట్టుకున్నాడు. ఇప్పటికీ నటుడిగా బిజీగా ఉన్నాడు. ఊహ హీరోయిన్‌గా చేసింది తక్కువ సినిమాలే అయినా బలమైన ముద్రే వేసింది.
వీరి వారసత్వాన్ని కొనసాగిస్తూ రోషన్ మేక, మేధ మేక ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. రోషన్ నిర్మలా కాన్వెంట్, పెళ్ళిసంద-డి, ఛాంపియన్ చిత్రాలతో మెప్పించాడు. ‘ఛాంపియన్’ నటుడిగా తన పరిణతిని చూపించింది. సినిమా అనుకున్నంత ఆడకపోయినా రోషన్‌కు పేరొచ్చింది. ఇక అతడి చెల్లెలు మేధ.. బాలనటిగా ‘రుద్రమదేవి’ సినిమా చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయి హీరోయిన్ అవతారం ఎత్తుతోంది.
మేధ లీడ్ రోల్‌లో ‘మైత్రి ఇన్ లవ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేస్తుండడం విశేషం. పృథ్వీ వనం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ రోజే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఈరోజు ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్ చేయబోతున్నారు. సోషల్ మీడియాలో ఆల్రెడీ మేధ ఫొటోలు కొన్ని కనిపిస్తున్నాయి. అందులో ఆమె అందంగా ఉంది. కథానాయికగా రాణించే లక్షణాలున్నట్లే కనిపిస్తోంది. మరి గురువారం రిలీజయ్యే గ్లింప్స్‌లో మేధ ఎలా మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on October 12, 2026 9:14 am
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…