Political News

మోడీ ప‌ర్య‌ట‌న‌… బ్లాక్ డ్రెస్‌లో సీఎం విజ‌య్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆదివారం త‌మిళ‌నాడులో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు. అయితే.. ఈ మొత్తం ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధానితో పాటు ప్రొటోకాల్ ప్ర‌కారం ముఖ్య‌మంత్రి విజ‌య్ కూడా పాల్గొన్నారు. కొత్త‌గా ప్రారంభించిన‌ మెట్రో రైల్లో ఇరువురు క‌లిసి కొద్దిదూరం ప్ర‌యాణించారు. అయితే.. ఈ పూర్తి ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌లో ముఖ్య‌మంత్రి విజ‌య్ న‌ల్ల‌దుస్తులు(బ్లాక్ డ్రెస్‌) ధ‌రించి పాల్గొన‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజ‌కీయ ప‌క్షాలు వేర్వేరు వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం దేశంలో స‌ర్ కు వ్య‌తిరేకంగా, ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు ప‌ట్టుబ‌డుతూ.. పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు స‌ర్కారు(టీవీకే) కూడా స‌ర్‌కు వ్య‌తిరేకంగా కామెంట్లు చేయ‌డంతోపాటు.. ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీనామా చేయాల‌న్న డిమాండ్‌ను కూడా స‌మ‌ర్థించింది. అయితే.. ప్ర‌త్య‌క్ష నిర‌స‌న‌ల‌కు మాత్ర‌మే టీవీకే దూరంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌లో సీఎం విజ‌య్ పూర్తిస్థాయిలో చొక్కా, ఫ్యాంటు కూడా న‌ల్ల దుస్తుల‌నే వేసుకోవ‌డం.. అదేస‌మ‌యంలో ఆయ‌న ముభావంగా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి ఆసక్తిగా మారాయి.

వ్యూహాత్మ‌క‌మే: డీఎంకే

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం డీఎంకే నాయ‌కులు స్పందిస్తూ.. విజ‌య్ చేసిన ప‌ని వ్యూహాత్మ‌క‌మేన‌ని.. ఆయ‌న ఉద్దేశ పూర్వ‌కంగానే న‌ల్ల‌దుస్తులు ధ‌రించార‌ని వ్యాఖ్యానించింది. ఇది కేవ‌లం త‌మిళ ప్ర‌జ‌ల‌ను ఏమార్చేందుకు చేసిన విన్యాసంగా పేర్కొంది. త‌మిళ‌నాడులో స‌ర్ కార‌ణంగా 78 ల‌క్ష‌ల ఓట్లు గ‌ల్లంత‌య్యాయ‌ని.. వీటికి నిర‌స‌న తెలియ‌జేయాల్సిన స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌కల్పించాల్సిన స‌మ‌యంలో విజ‌య్‌.. మోడీ ముందు న‌ల్ల‌దుస్తులు వేసుకుని న‌టించార‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఈ విన్యాసాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై టీవీకే నాయ‌కులు మౌనంగా ఉన్నారు. ప్రొటోకాల్ ప్ర‌కారం ముఖ్య‌మంత్రి హాజ‌ర‌య్యార‌ని, దుస్తుల‌ను రాజ‌కీయం చేస్తారా? అని ఒక‌రిద్ద‌రు నాయ‌కులు వ్యాఖ్యానించారు.

బీజేపీ మౌనం

ముఖ్య‌మంత్రి విజ‌య్ ఆహార్యంపై బీజేపీ మౌనంగా ఉంది. డీఎంకే ఈ విష‌యాన్ని రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు గుప్పించిన‌ప్ప‌టికీ.. బీజేపీ నాయ‌కులు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న కావ‌డంతో దీనిపై ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. ఇక‌, మ‌రోప్ర‌తిప‌క్షం అన్నాడీఎంకే ఉన్న‌ప్ప‌టికీ.. మోడీకి అనుకూలంగా ఉండ‌డంతో ఆ పార్టీ నాయ‌కులు కూడా మౌనంగానే ఉన్నారు. విజ‌య్ డ్రెస్‌, ప్ర‌ధానితో ఆయ‌న ముభావంగా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అదేస‌మయంలో పలువురు వ్యాఖ్య‌లు కూడా చేస్తున్నారు.

This post was last modified on October 12, 2026 11:04 am

Share

Recent Posts

ఈ దెబ్బతో గొడ్డలి పార్టీ మూతపడాలి

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…

30 minutes ago

ఎక్కాల్సిన రైలు బాగా లేటయ్యింది

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…

46 minutes ago

నాన్న, అమ్మ, కొడుకు.. ఇప్పుడు కూతురు కూడా

సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…

2 hours ago

స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు

గత ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను పనిచేశాను. స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు. మీ అవసరాల కోసం. అందుకే…

6 hours ago

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

11 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

13 hours ago