ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని పార్టీ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని జగన్ మినహా ఇతర నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు కూడా చేపట్టారు. అయితే.. ఇది ఎంత వరకు మంచిది? లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుంటే ఏమేరకు సింపతీ వస్తుంది? అని ఆలోచించేవారు కూడా వైసీపీలోనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే టార్గెట్ లోకేష్‌తో సింపతీ రాదన్న చర్చ వైసీపీలోనే ఎక్కువగా జరుగుతోంది. దీనికి ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయని సీనియర్లు కూడా అంటున్నారు. 1) సాధారణ ప్రజల్లో లోకేష్ పై సింపతీ ఉంది. పైగా.. చంద్రబాబు వారసుడిగా ఆయనపట్ల సింపతీ కూడా ఉంది. దీంతో ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తే.. ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. పైగా ఇది వృథా ప్రయాసే అవుతుందని అంటున్నారు. ఇక, 2) యువతలో చాలా ఆశలు: మంత్రి లోకేష్ యూత్‌ను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు.
ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్‌కు లోకేష్ చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యారు. అంతేకాదు.. ఉద్యోగాలు ఇవ్వడం లోను.. పెట్టుబడులు తీసుకురావడంలోనూ.. లోకేష్ దూకుడుగా ఉన్నారన్న సంకేతాలు కూడా ఉన్నాయి. అందుకే యువత ఆయనకు కనెక్ట్ అయ్యారు. ఈ క్రమంలో వైసీపీ ఎన్ని చెప్పినా.. లోకేష్‌పై ఎన్ని ఆరోపణలు చేసినా.. పట్టించుకునే వారు పెద్దగా కనిపించరని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఎవరూ బహిరంగ విమర్శలు చేయడం లేదు. కానీ, నిదానంగా పార్టీకి చెబుతున్నారు.
ఇక, 3వ కారణం) రాజకీయంగా బలమైన వాయిస్ వినిపిస్తుండడం. వైసీపీని టార్గెట్ చేయడం: ఈ రెండు అంశాల్లో గత ఐదేళ్లతో పోల్చుకుంటే ప్రస్తుతం మంత్రి లోకేష్ పుంజుకున్నారు. ఆయనను ఎదుర్కోవడం వైసీపీలో ఉన్న నాయకులకు సాధ్యం కావడం లేదేన్న చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే దొడ్డి దారిలో లోకేష్‌ను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.
4) వైసీపీ ఆరోపిస్తున్న డీఎస్సీ: డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిరుద్యోగులు చెబుతున్నారు. పైగా అంతా పారదర్శకమేనని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు హైకోర్టు కూడా కేసులు కొట్టేసింది. ఈ నేపథ్యంలో లోకేష్ రాజీనామా అంటే.. హాస్యాస్పదంగానే ఉంటుందని వైసీపీలోనే కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates