మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్ టాక్ రావడం బాక్సాఫీస్ కు కొత్త కాకపోయినా ఒక క్రేజీ సీక్వెల్ కి ఇలాంటి రెస్పాన్స్ ఎవరూ ఊహించలేదు. వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రిస్క్ చేసిన నిర్మాతకు ఫైనల్ గా పాతిక కోట్ల గ్రాస్ కనిపించకపోవడం ఆశనిపాతమే. ఏదో యావరేజ్ అనిపించుకున్నా ఎంతో కొంత గట్టేక్కేది కానీ ఇప్పుడా ఛాన్స్ లేకుండా పోయింది. రేపటి నుంచి కొనసాగడం నామమాత్రమే.
సర్దార్ 2ని దెబ్బేసిన మరో ప్రధాన అంశం మండాడికొచ్చిన స్పందన. తమిళ వెర్షన్ దుమ్ము దులుపుతుండగా తెలుగులోనూ నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ దాటేయడం ఊహించని పరిణామం. కంటెంట్ ని ఎంతో నమ్మిన కార్తీకి నిజంగా ఇదంతా షాక్ కలిగించే రిజల్ట్. ఎస్జె సూర్యతో కలిసి చేసిన ప్రమోషన్లు, హైదరాబాద్ వచ్చి మరీ తెలుగు ఆడియన్స్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలు అనీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. దర్శకుడు మిత్రన్ సర్దార్ నమ్మినవాళ్లకు పెద్ద ఝలకే ఇచ్చారు.
కార్తీకి ఇలాంటి ఫ్లాప్స్ కొత్త కాదు. మొన్న అన్నగారు వస్తారు అంతకు ముందు జపాన్ కూడా ఇదే బాట పట్టాయి. కానీ వాటి బడ్జెట్, స్కేల్ తక్కువ. సర్దార్ 2 అలా కాదు. మార్కెట్ ని మించి ఖర్చు పెట్టారు. పార్ట్ 2 మీద గుడ్డిగా కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు. తీరా చూస్తేనేమో ఇలా రివర్స్ అయ్యింది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే సర్దార్ 3తో ఫ్రాంచైజ్ కొనసాగించాలని ఆలోచించారు కానీ ఇప్పుడా దారులన్నీ మూసుకుపోయాయి. సర్దార్ ప్రయాణం ఇక్కడితో ముగిసింది.
నష్టాలకు సంబంధించిన తుది లెక్కలు ఇంకో రెండు మూడు రోజుల్లో బయటికి వస్తాయి కానీ ఆర్థికంగా జరిగిన డ్యామేజ్ మాత్రం చాలా పెద్దదని చెన్నై మీడియా వర్గాలు కథనం. రికవరీ కనీసం యాభై శాతం కూడా లేకపోతే దాన్నెలా అర్థం చేసుకోవాలని, దీన్ని బట్టి ఇది ఎంత పెద్ద పరాజయమో వివరిస్తున్నాయి. ఇకనైనా దర్శకులు ప్రతి హిట్ సినిమాకు సీక్వెల్ పిచ్చిలో పడకుండా కొత్త కథలు, సబ్జెక్టులు రాసుకోవడం మేలు. లేదంటే ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates