రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కొత్తగా పార్టీ పెట్టాలన్న ఆలోచనలో వున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య ఒకసారి ఇలాంటి ప్రచారం జరిగింది. ఆ తర్వాత దాని గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త పార్టీ ఉహాగానాలు వినిపిస్తున్నాయి.
వైఎస్ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా గుర్తింపు పొందిన విజయసాయి రెడ్డి వైసీపీ ఆవిర్భావం తర్వాత నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లో చక్రం తిప్పారు. వైసీపీలో ట్రబుల్ షూటర్ గా క్రియాశీలకంగా వ్యవహరించిన అయన పార్టీలో జగన్ తర్వాత నెంబర్ టూ నాయకుడిగా ఎదిగారు.
పార్టీలో ఆంతా తానే అన్నట్లు వ్యవహారాలు నడిపారు. ఎవరూ ఊహించని రీతిలో వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేయాలనుకుంటున్నానని ప్రకటించారు. అయితే కొంత కాలం కూడా ఓపిక పట్టకుండానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు. తరచుగా పొలిటికల్ కామెంట్స్ పెడుతూ చర్చనీయాంశంగా మారరు.
వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లారని కొంతకాలం ప్రచారం జరిగింది. ఆయన టీడీపీలో చేరవచ్చని కూడా చెప్పుకున్నారు. హిందుత్వ అనుకూల ప్రకటనలు చేయడం మొదలు పెట్టడంతో బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఇదంతా ఒట్టిదేనని, వైసీపీలో చేరేందుకు జగన్ తో చర్చలు జరుగుతున్నాయని కథనాలు వచ్చాయి. ఇన్ని రకాల మలుపులు తిరిగిన సాయి రెడ్డి కథ మళ్ళీ రాజకీయ పార్టీ దగ్గరకు వచ్చింది. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని పొలికల్ సర్కిల్ లో వినిపిస్తుంది.
ఢిల్లీలో కాక్రోచ్ ఉద్యమం విజయవంతం అయ్యాక విజయసాయి రెడ్డి ఆలోచనల్లో మార్పు వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రజలు చంద్రబాబు, జగన్ పరిపాలన చూశారని, ఇద్దరిమధ్య నమ్మకం కోల్పోయినప్పటికీ గత్యంతరం లేక ఒకసారి టీడీపీకి మరోసారి వైసీపీకి ఓట్లు వేస్తున్నారని సాయి రెడ్డి చెబుతున్నట్లు సమాచారం.
వీరిద్దరికీ ప్రత్యమ్నాయంగా బలమైన రాజకీయ పార్టీ వస్తే ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా వున్నారని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఇటీవల టీడీపీ, వైసీపీ పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెట్టి, ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్టీ ప్రకటన చేయాలన్న వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తుంది.
This post was last modified on August 5, 2026 4:25 pm
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…