Movie News

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే అదే మహాప్రసాదంలా అయిపోయింది. ప్యారడైజ్ కు ఆయా షేర్, యెషనాగుల చేసిన మేలు ఎంతో మళ్ళీ చెప్పనక్కర్లేదు. అయితే ఒరిజినల్ కంపోజర్ కాకుండా బయట జనంలో తిరుగుతున్న ప్రైవేట్ పాటలను సరైన రీతిలో వాడుకుంటే అవి చేసే అద్భుతాలు అంతా ఇంతా కాదు. ఇరుముడిలో ముత్యాల పల్లకి కన్నా గొప్ప ఉదాహరణ అక్కర్లేదు. దీని కోసమే థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్ ఉన్నారు.

ఇప్పుడీ ప్రస్తావనకు కారణం కొత్తగా సోషల్ మీడియాలో వైరలవుతున్న సాంగ్. ‘జిమ్ జిమ్ తార జిలేబి తేరా చిన్నోడా’ అంటూ ఒక మహిళ పాడిన సెల్ఫీ వీడియో సాంగ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కొందరు డీజే రీమిక్స్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ కావడం మొదలయ్యింది. ఆవిడ మొహాన్నే చూపిస్తూ చిన్న చిన్న పదాలతో కూర్చిన సాహిత్యాన్ని మ్యూజిక్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె పాడిన అత్తరు సాయిబు లాంటి మరో రెండు పాటలు కూడా హిట్టయ్యాయి.

ఇదంతా చూస్తూ మనోళ్లు ఊరుకుంటారా. అప్పుడే ఈ పాటల హక్కుల కోసం ఆరాలు తీయడం మొదలయ్యాయట. జిమ్ జిమ్ తారాకు రీచ్ ఎక్కువ రావడంతో దాన్ని వాడుకునే దిశగా సదరు మహిళను సంప్రదించే పనిలో ఉన్నారని తెలిసింది. ఇలాంటివి థియేటర్లలో మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి. జనాలు వెంటనే గుర్తు పట్టి కనెక్ట్ అయిపోతారు. ఆ మధ్య లిటిల్ హార్ట్స్ లో మౌళి చేసింది ఈ పనే. అదెంత బ్లాస్ట్ అయ్యిందో ఆడియన్స్ అంత సులభంగా మర్చిపోలేరు.

ఇంత పాజిటివ్ విషయంలోనూ సీరియస్ గా చూడాల్సిన మ్యాటర్ ఒకటుంది. ఒకప్పుడులా టాలీవుడ్ సంగీతంలో అద్భుతాలు జరగడం లేదు. ఇళయరాజా, రెహమాన్, కీరవాణి, డిఎస్పి టైంలో డిజాస్టర్లలో కూడా మంచి పాటలు ఉండేవి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ హిట్లలో కూడా గొప్ప పాటలు ఉండటం అరుదైపోయింది. అందుకే ఈ కరువు బయట ప్రైవేట్ సాంగ్స్ ఇంత ఆదరణ పొందేలా చేస్తోంది. ఏకంగా లక్షలు ఖర్చు పెట్టి హక్కులు కొనేలా చేస్తోంది. ట్రెండ్ అలా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేయగలరు.

This post was last modified on October 5, 2026 1:28 pm

Share

Recent Posts

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

1 hour ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

2 hours ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

2 hours ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

2 hours ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

2 hours ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

4 hours ago