Movie News

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు. అయితే ఆయన చెప్పిన కారణాలు మాత్రం వెంకటేష్ అభిమానులకు నమ్మశక్యంగా లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా బ్యాక్ లాష్, ట్రోలింగ్ కి జడిసి 200 శాతం మేము సంతృప్తి చెందాకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని, పెండింగ్ పనులకు ఇంకో రెండు మూడు వారాలు పడుతుందని, అప్పటిదాకా వేచి చూడమని పనిలో పని క్షమాపణ చెప్పారు.

నాగవంశీ చెప్పిన ప్రకారం ఇంకా ట్రైలర్ కట్, రెండు పాటలు పెండింగ్ ఉన్నాయి. మరి ఏ కాన్ఫిడెన్స్ తో కేవలం నాలుగు రోజుల ముందు అక్టోబర్ 9 డేట్ ట్వీట్ చేశారనేది అసలు ప్రశ్న. వెంకటేష్ లండన్ వెళ్ళేది ముందే ఫిక్సయ్యింది. రిలీజ్ నాటికి ప్రమోషన్లలో పాల్గొనడం ఇబ్బందవుతుందని భావించి ముందే ఇంటర్వ్యూలిచ్చారు. వాటి తాలూకు వీడియోలు ఆల్రెడీ ఎక్స్, ఇన్స్ టాలో తిరుగుతున్నాయి. మరి బ్యాలన్స్ వర్క్ ఉన్నప్పుడు ఇంత హడావిడి ఎందుకు పడ్డారనేది లాజిక్ కు అందటం లేదు.

టాలీవుడ్ క్రమశిక్షణ రాహిత్యం గురించి కూడా నాగవంశీ ప్రస్తావనకు తెచ్చారు. కేవలం రెండు మూడు రోజుల ముందు ఇలా వాయిదా వేయడం భావ్యం కాదని, దీని వల్ల ఇబ్బంది పడే మిడ్ రేంజ్ సినిమాల నిర్మాతలకు సారీ అని ఓపెనయ్యారు. జైలర్ 2 కోసం పోస్ట్ పోన్ వార్తలను ఖండించారు. తమన్ ని ఇంకో పాట అడిగితే కొట్టబోయినంత పని చేశారని కూడా అన్నారు. సరే వీటిలో ఒప్పుకునేవి అనుమానం వచ్చేవి కాసేపు పక్కనపెడితే ఒక ముఖ్యమైన పాయింట్ విశ్లేషించుకోవాలి.

ఆదర్శ కుటుంబం ఏడాదిగా నిర్మాణంలో ఉందని నాగవంశీనే చెప్పారు. ఇదేమి విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడిన గ్రాండియర్ కాదు. సలార్, ఆర్ఆర్ఆర్ లాగా ఓవర్ బడ్జెట్ కాదు. అలాంటప్పుడు ఎందుకు ఇంత జాప్యమనేది అసలు క్వశ్చన్. అది కూడా వెంకటేష్ ఉన్నప్పుడు. నిన్న మొన్న మొదలుపెట్టిన అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ లో ఉంది. కానీ ఆదర్శ కుటుంబం ఇంకా రెండు మూడు వారాల పెండింగ్ ఉండటం ఊహకందని విచిత్రం.

This post was last modified on October 5, 2026 4:54 pm

Share

Recent Posts

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

4 minutes ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

30 minutes ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

2 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

3 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

3 hours ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

3 hours ago