Political News

బండి పదవికి గండి పడనుందా

కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని ఢిల్లీ మీడియా కోడై కూస్తుంది. ఈ నెల 15 వ తేదీన మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ఢిల్లో పొలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. కేంద్ర మంత్రులందరూ అందుబాటులో వుండాలని మంగళవారం పిలుపు రావడంతో బండి సంజయ్ హుటాహుటిన ఫ్లయిట్ ఎక్కి ఢిల్లీ చేరుకున్నారు. రెండు మూడు రోజులు అక్కడే ఉంటారని సన్నిహితులు చెబుతున్నారు.

ఇప్పటికే బండి సంజయ్ ని రాజీనామా చేయమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుంది. బండి కుమారుడి వ్యవహారంలో తెలంగాణాలో పార్టీకి డ్యామేజ్ జరిగిందని, కనుక పదవి నుంచి తప్పుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది. బండి మాత్రం రాజీనామా చేయకుండా మొండికేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి . ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న మోదీ టీం మాట వింటే సరే సరి లేకపోతే నిర్మొహమాటం లేకుండా పదవి నుంచి తప్పిస్తామని సంకేతం ఇచ్చినట్లు సమాచారం.

2021 జులై 7 వ తేదీన బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవిని చేపట్టారు. ఇటీవల కుమారుడు భగీరథ్ మీద పోక్సో కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి కుమారుడు పోక్సో కేసులో జైలుకు వెళ్లి రావడం ప్రభుత్వానికి తద్వారా పార్టీకి చెడ్డపేరు వచ్చిందని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత కూడా ఆయనను పదవిలో కొనసాగిస్తున్నారు. జెన్ జీ క్రియాశీలంగా వ్యవహారిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశం ఉన్నందున బండి మీద వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.

భగీరథ్ యవ్వారమే కాకుండా అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ పెడతానంటూ బండి సంజయ్ చెప్పినట్లు వచ్చిన వార్తలను కూడా అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. కొత్త పార్టీ విషయాన్ని బండి ఖండించడమే కాకుండా చనిపోయాక తన మృతదేహం మీద బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయినప్పటికీ అధిష్టానం క్షమించినట్లు లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

This post was last modified on August 5, 2026 1:49 pm

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

1 hour ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

3 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

4 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago