Movie News

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది. ముఖ్యంగా జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ బాగా బలహీనపడడంతో ఎవరైనా పెద్ద సినీ స్టార్ రంగంలోకి దిగితే ఆ ఖాళీని భర్తీ చేయవచ్చనే అభిప్రాయాలు కలిగాయి.

కానీ కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చినా కనీస ప్రభావం చూపలేకపోయారు. ఆ ఖాళీని పూడ్చలేకపోయారు. రజినీ వచ్చినట్లే వచ్చి వెనక్కి తగ్గారు. ఐతే విజయ్ మాత్రం తెలివిగా రాజకీయం చేశారు. తన మీద జనాల్లో ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మలుచుకున్నారు. అన్నీ ఆయనకు కలిసొచ్చి తొలి ప్రయత్నంలోనే ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు.

విజయ్ సక్సెస్ చూశాక.. చాలామంది తమిళ స్టార్లలో రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇన్నేళ్లు అధికారంలో ఉన్న డీఎంకే కూడా బలహీన పడుతున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ధనుష్ ఆల్రెడీ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ దిశగా కొన్ని నెలల ముందు ఫ్యాన్ మీట్ పెట్టి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. అభిమానులతో సేవా కార్యక్రమాలు చేయిస్తున్నాడు. ఇలాగే విశాల్ సైతం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు చెప్పకనే చెప్పాడు.

ఈ బాటలోనే ఇప్పుడు శివ కార్తికేయన్ రాజకీయ రణరంగంలోకి దిగబోతున్నట్లు ఇండికేషన్ ఇచ్చాడు. తాజాగా శివ కూడా ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేశాడు. అందులో తన ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. తాను పీపుల్ మేడ్ స్టార్ అని, ప్రజల వల్లే ఈ స్థాయిలో ఉన్నానని వ్యాఖ్యానించాడు. అనేక మంచి విషయాలు చెబుతూ, ప్రజలకు ఒక సందేశం ఇచ్చేలా తన ప్రసంగం సాగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలోనే అభిమానులు హాజరయ్యారు. శివకార్తికేయన్ డ్రెస్సింగ్, తన ప్రసంగం అన్నీ కూడా రాజకీయ నాయకుడి తరహాలోనే ఉండడం విశేషం.

శివ సినిమాల్లోకి రావడంతో ధనుష్‌ పాత్ర కీలకం. హీరోగా తన తొలి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది అతనే. కానీ తర్వాత ఎందుకో తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. శత్రువుల్లా మారిపోయారు. ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సంకేతాలిచ్చిన నేపథ్యంలో అతడికి పోటీగానే శివ ఈ రంగంలోకి వస్తున్నాడా అనే చర్చ జరుగుతోంది. శివ.. విజయ్‌కి అభిమాని అని చెప్పుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయన పార్టీలో చేరతాడా, లేక సొంత ప్రయాణం చేస్తాడా అన్నది ఆసక్తికరం.

This post was last modified on October 5, 2026 4:47 pm

Share

Recent Posts

ఈసారి పుష్కరాల్లో అలాంటి పొరపాట్లు జరగవు: రాజమండ్రి MLA

https://youtu.be/GBEMMz7D6C8?si=HbG0xf2skHBR-huG 2015 జూలై 14న గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన…

11 minutes ago

కనెక్ట్ అయితే కుటుంబానికి కనకవర్షమే

ఇంకో అయిదు రోజులో ఆదర్శ కుటుంబం ఏకే 47 విడుదల కానుంది. ముందు నుంచి కొంత నెగటివిటీ నడిచినప్పటికీ ట్రైలర్…

2 hours ago

ఇంత ‘కల్ట్’ ఫాలోయింగ్ ఊహించలేదేమో

ఒకప్పుడు హీరోలకు షూటింగ్ లేని టైంలో వాళ్ళను కలుసుకునేందుకు అభిమానులు నేరుగా ఇళ్ల వద్దకు వెళ్ళేవాళ్ళు. స్టార్లు కూడా విసుక్కోకుండా…

3 hours ago

హిట్ట‌యితే వంద‌లు… ఫ్లాప్ అయితే ఒక‌ట్లు

ప‌దేళ్ల కింద‌ట ప్రేమమ్ సినిమాతో సౌత్ ఇండియా అంత‌టా విప‌రీత‌మైన పాపులారిటీ సంపాదించాడు మ‌ల‌యాళ న‌టుడు నివిన్ పౌలీ. ఆ…

5 hours ago

నేత‌ల వైఖ‌రితో చంద్ర‌బాబు.. జ‌గ‌న్ వైఖ‌రితో నేత‌లు..

ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అంతా బాగుంద‌న్న ఫీలింగ్ ఆయా పార్టీల్లో పైకే క‌నిపిస్తోంది. అంత‌ర్గ‌తంగా చూస్తే..…

7 hours ago

బిల్డప్ ఇచ్చిన సినిమాకు టాక్ ఏంటి

ఫ్యామిలీ మ్యాన్ పుణ్యమాని ఓటిటి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో ఒకరిగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ కొత్త…

9 hours ago