Political News

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన కొలికూడికి టీడీపీ అధినేత చంద్రబాబు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. తిరువూరు టికెట్ కోసం ఎంతోమంది పోటీలో ఉన్నా సరే అమరావతి ఉద్యమ సమయంలో కొలికపూడి పడిన కష్టానికి గుర్తింపు దక్కాలని చంద్రబాబు భావించారు. అయితే, చంద్రబాబు ఇచ్చిన గౌరవాన్ని, గుర్తింపును కొలికపూడి శ్రీనివాసరావు నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాల్సి వస్తోంది.

పార్టీ లైన్ దాటవద్దని, ఏవైనా విషయాలుంటే చర్చించి పరిష్కరించుకోవాలని, రోడ్డెక్కవద్దని టీడీపీ క్రమశిక్షణా కమిటీ వారించినా సరే కొలికపూడి తీరు మాత్రం మారడం లేదు. గతంలో ఎన్నిసార్లు బుజ్జగించి చెప్పినా సరే కొలికపూడి మాత్రం నేనింతే అంటూ మరోసారి తన వివాదస్పద వ్యాఖ్యలను కొలికపూడి మళ్లీ మొదలెట్టారు.

తిరువూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతోనే తన విషయంలో వివక్ష చూపిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనల గురించి తనకు తెలియడం లేదని, అదే వేరే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ఇలా జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన శాసన సభ్యులు మీ దృష్టిలో ఏంటి అంటూ ఆయన అన్నారు. విస్సన్నపేట మండలంలో తనకు సమాచారమివ్వకుండా సీసీ రహదారుల నిర్మాణ ప్రారంభోత్సవాలు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఇక, తన నియోజకవర్గంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన షాకింగ్ ఆరోపణలు చేశారు.

మరోవైపు, కొలికపూడి అనురులపై విజయవాడలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కార్యాలయం ఎదుట కొలికపూడి శ్రీనివాసరావు ధర్నా చేస్తారని చెబుతూ ఆయన అనుచరులు తనకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

This post was last modified on October 5, 2026 2:14 pm

Share

Recent Posts

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

15 minutes ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

36 minutes ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

58 minutes ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

3 hours ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

3 hours ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

4 hours ago