Political News

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా చర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొంది. అయితే.. దీనిని అధికారికంగా ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపింది. పేప‌ర్ల‌లో వ‌చ్చే వార్త‌ల‌ను విశ్వ‌సించ‌లేమ‌ని.. న్యాయ ప‌రిధిలో వాటిని ప‌రిగ‌ణించలేమ‌ని పేర్కొంది. అయితే.. ఏ వ్య‌వ‌స్థ అయినా చ‌ట్టం ప్ర‌కారం ప‌నిచేయాల్సిందేన‌ని పేర్కొంది. ఇక‌, ఇప్ప‌టికిప్పుడు జ్ఞానేష్ కుమార్‌ను ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది.

వివాదం ఏంటి?

స‌ర్ ప్ర‌క్రియ చేప‌ట్టిన త‌ర్వాత‌.. కోట్ల మంది ఓటు హ‌క్కు కోల్పోయారు. వీరంతా మ‌రోసారి ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఫామ్‌-6ను ఆశ్ర‌యించారు. అయితే.. దీనిలోనూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం మార్పులు చేసింది. కొత్త‌గా ఓటు హ‌క్కు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఫామ్‌-6లో కూడా 2002 నాటి ఓట‌ర్ల జాబితాలో తాత‌లు, తండ్రులు, కుటుంబ స‌భ్యుల వివ‌రాల‌ను పేర్కొనాల‌ని తెలిపింది. ఇది పెనుదుమారానికి దారితీసింది. మ‌రోవైపు ఎన్నిక‌ల సంఘంలో జ్ఞానేష్ కుమార్ ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

వీటిపై తాజాగా జ్ఞానేష్‌ను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిని విచారించిన ధ‌ర్మాస‌నం.. జ్ఞానేష్‌పై ఇప్ప‌టికిప్పుడు వేటు వేయ‌లేమ‌ని పేర్కొంది. అయితే.. ఎవ‌రైనా స‌రే.. రాజ్యాంగం, చ‌ట్టం ప్ర‌కారం న‌డుచుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. జ్ఞానేష్ కుమార్‌కు వ్య‌క్తిగ‌తంగా నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి ఒక్క‌రి ఓటు హ‌క్కుకు భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన బాధ్య‌త ఎన్నిక‌ల సంఘానిదేన‌ని స్ప‌ష్టం చేసింది. ఫామ్ 6లో మార్పుల‌ను వ్య‌క్తిగ‌తంగా చేసి ఉంటే.. త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.

ఫామ్‌-6లో మార్పులు..

ఇక‌, ఇప్ప‌టికే ఫామ్‌-6పై తీవ్ర ఆరోప‌ణ‌లు రావ‌డం, నిర‌స‌న‌లు పెల్లుబుక‌డంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవ‌ల దీనిలో మార్పులు స‌వ‌రించుకుంది. గ‌తంలో ఉన్న ఫామ్‌-6నే అనుస‌రించాల‌ని.. 2002 నాటి జాబితాతో ప‌నిలేద‌ని తేల్చిచెప్పింది. కొత్త‌గా ఓటు హ‌క్కు కోసం దాఖ‌లు చేసుకునేవారు.. ఫామ్ 6ను య‌థాత‌థంగా పూర్తి చేసి ఇస్తే స‌రిపోతుంద‌ని పేర్కొంది.

This post was last modified on October 5, 2026 2:40 pm

Share

Recent Posts

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

55 minutes ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

1 hour ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

1 hour ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

2 hours ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

4 hours ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

4 hours ago