అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష పడేందుకు ఏమీ లేకుండా పోయింది. ఎందుకంటే థియేటర్ బిజినెస్ లెక్కల్లో నాలుగు వందల యాభై కోట్లు దాటితేనే సేఫ్ అనిపించుకునే పరిస్థితిలో ట్రిపుల్ సెంచరీ దగ్గరే ఆగిపోవడం అభిమానులకు బాధ కలిగిస్తోంది. పైరసీ హెచ్డి ప్రింట్ నెలల క్రితమే వచ్చేయడంతో పాటు నెగటివ్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ కావడం ప్రేక్షకులను ప్రభావితం చేసింది.
నిజంగా భవిష్యత్తులో విజయ్ కనక సినిమాలు చేయని పక్షంలో జన నాయకుడు బ్యాడ్ ఫేర్ వెల్ గా నిలిచిపోతుంది. గతంలో ఇలా చెప్పి మాట తప్పిన వాళ్ళ లిస్టు పెద్దదే ఉంది. శంకర్ దాదా జిందాబాద్ తర్వాత టాలీవుడ్ కు గుడ్ బై చెప్పిన చిరంజీవి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. అజ్ఞాతవాసి తర్వాత నటించనని చెప్పిన పవన్ కళ్యాణ్ తిరిగి సెట్స్ లో అడుగు పెట్టాక వరసగా మూడు రీమేక్స్ చేసి గత ఏడాది ఓజితో బ్లాక్ బస్టర్ కొట్టారు.
ఇక రజనీకాంత్, కమల్ హాసన్ మొదలైనవాళ్లది కూడా ఇదే వరస. అయితే వాళ్ళెవరికీ సాధ్యం కానీ ఘనత విజయ్ అందుకున్నారు. మొదటిసారి పార్టీ పెట్టిన వెంటనే ముఖ్యమంత్రి అయిపోయి ఎంజిఆర్, ఎన్టీఆర్ సరసన చోటు సంపాదించుకున్నారు. అందుకే తిరిగి సినిమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జన నాయకుడు ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని చివరి సినిమాగా స్వీకరించక తప్పదని నొక్కి వక్కాణిస్తున్నారు.
తమిళనాడులో మాత్రమే జన నాయకుడుకి డీసెంట్ కలెక్షన్లు కొనసాగుతున్నాయి. తెలుగులో వాష్ అవుట్ అయిపోయింది. హిందీలోనూ అదే ఫలితం. ఒకవేళ రీమేక్ కాకుండా స్ట్రెయిట్ సబ్జెక్టుతో కమర్షియల్ సినిమా తీసి ఉంటే మటుకు రికార్డులు ఖచ్చితంగా బద్దలయ్యేవి. అందరూ ఆల్రెడీ చూసేసిన భగవంత్ కేసరిని ఎంచుకోవడం చేటు చేసింది. రెండు వారాలు పూర్తయిపోవడంతో ఇకపై పెద్దగా రన్ ఆశించలేం. నాలుగు వారాల విండోతో ఈ నెలలోనే ఓటిటి రిలీజ్ ఉండొచ్చట.
This post was last modified on August 5, 2026 4:29 pm
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…
మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులకు ఆయన ఈ విషయంలో…
ఇంకో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రానుంది. గుంటూరు కారం తర్వాత తన దర్శనం స్క్రీన్…
యువ కథానాయకుడు సందీప్ కిషన్ కెరీర్లో సక్సెస్ రేట్ తక్కువే అయినా.. అవకాశాలకేమీ లోటుండదు. ఎప్పుడూ చేతిలో రెండు మూడు…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చాలా రోజుల తరువాత ఒక సాధారణ ఉద్యోగిలా దర్శనమిచ్చాడు. శ్రీలంక…