రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ దిగ్గజ వ్యాపార సంస్థ రిలయెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కీలక ప్రకటన చేశారు. తాము స్వయం లక్ష కోట్ల రూపాయలను సీమలో పెట్టుబడిగా పెడతామని.. తద్వారా కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తికి దారులు పరుస్తామని చెప్పారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రానికి ఏటా 60 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. అదే సమయంలో 3 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు. ఇలా.. లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిపై ప్రకటన చేసింది అనంత్ అంబానీ.
ఆ తర్వాత.. మాట్లాడిన చంద్రబాబు .. అనంత్ చేసిన ప్రకటననే గుర్తు చేశారు. లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెడతానని ముందుకు వచ్చిన అనంత్‌ను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఆయనను అభినందిస్తున్నానని కూడా అన్నారు. ఈ పెట్టుబడితో రైతుల జీవితాల్లో సంపూర్ణ మార్పులు వస్తాయని.. రాయలసీమ రత్నాల సీమ అవుతుందని చెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు. సో.. మొత్తంగా పెట్టుబడి ప్రకటన.. పూర్తిగా అనంత్ అంబానీ నోటి నుంచే వచ్చింది. శుక్రవారం మదనపల్లెలో జరిగింది ఇదీ.!
కానీ, తాజాగా శనివారం వైసీపీ అధినేత జగన్ ఈ విషయంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారని.. ఇది శుద్ధ అబద్ధమని.. ఆయన పిట్టలదొర కబుర్లు ఎవరూ నమ్మబోరని వ్యాఖ్యానించారు. సీమ రైతులను ఏనాడైనా పట్టించుకున్నావా.. అని సుదీర్ఘ పోస్టులో జగన్ నిలదీశారు. చంద్రబాబు అంకెల గారడీ చేస్తున్నారని విమర్శించారు. కనీసం రైతులకు బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల్లో సగం కూడా వారికి ఖర్చు చేయడం లేదన్నారు. ఇప్పుడు ఏకంగా.. లక్ష కోట్లు అంటూ బురిడీ కొట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
అసలు మంట వేరే!
అయితే.. వాస్తవానికి జగన్‌కు అసలు కోపం అంతా అంబానీలపైనే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖేష్ అంబానీ వచ్చి రాజ్యసభ సీటును అడిగితే.. పరిమళ్ నత్వానీకి బంగారు పళ్లెంలో పెట్టి అందించారు. అదేవిధంగా అడిగిన వెంటనే పోర్టులు కేటాయించారు. ఇలా.. ఇన్ని చేస్తే.. ఇప్పుడు కూటమి సర్కారుకు, ముఖ్యంగా చంద్రబాబుకు అంబానీ కుటుంబం కనెక్ట్ కావడాన్ని జగన్ జీర్ణించుకోలేక పోతున్నరన్నది విశ్లేషకుల మాట. అలాగని అంబానీలను విమర్శించే ధైర్యం చేయలేక.. అందుకే.. లక్ష కోట్ల పెట్టుబడిని అడ్డు పెట్టుకుని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారని అంటున్నారు.
This post was last modified on October 3, 2026 10:52 pm
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…