తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్ వేసి పరిశ్రమలోకి స్వాగతం చెప్పేవాళ్ళు. కానీ తను నటన కంటే దర్శకత్వం వైపు మొగ్గు చూపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సరే కుర్రాడు ఇంత ధీమాగా ఉన్నాడు అంటే ఏదో అద్భుతం చేస్తాడేమో అని ఫ్యాన్స్ భావించారు. అయితే సిగ్మాకు మొదటి షో నుంచే ఆశించిన స్పందన కనిపించలేదు. ఓపెనింగ్స్ వచ్చాయి కానీ నిలబడేంత టాక్ వినిపించలేదు.
కారణం జేసన్ సంజయ్ ఎంచుకున్న కథా కథనాలు. యుఎస్ లో శిక్షణ తీసుకుని ఇతను ఆలోచించింది, రాసుకుంది ఇలాంటి స్టోరీనా అని అనుమానం వచ్చేంత తక్కువ స్థాయిలో కంటెంట్ ఉండటం నెగటివ్ ఫీడ్ బ్యాక్ తీసుకొచ్చింది. పుస్తకాలు ఉండే లైబ్రరీలు అంతరించిపోయిన టైంలో దాన్ని నడుపుతున్న హీరో చుట్టూ వెయ్యి కోట్ల ట్విస్టుని లింక్ చేసే ఆలోచన బాగానే ఉన్నా దాన్ని తెరమీద ప్రెజెంట్ చేసే తీరుబాలేదు. జేసన్ సంజయ్ బేసిక్స్ కంటే తక్కువ స్థాయిలో ఉండటంన వల్ల అవుట్ ఫుట్ తేడా కొట్టేసింది.
జూనియర్ విజయ్ గుర్తించాల్సింది ఒకటుంది. ఆడియన్స్ చాలా తెలివి మీరిపోయారు. కేవలం తమ భాషనే కాకుండా ఫారిన్ లాంగ్వేజెస్ లో కూడా కంటెంట్ చూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ ఫార్మ్స్ వచ్చాక ఇది మరింత తేలికయ్యింది. సో వాళ్ళను మెప్పించాలంటే ఆషామాషీ కథలతో పనవ్వదు. అంత ఇమేజ్ ఉన్న తండ్రి జన నాయకుడు ఏం చేసింది. దారుణంగా బోల్తా కొట్టింది. కారణమేంటో తెలిసిందే. ఒక హిట్ రీమేక్ సైతం కాపాడలేకపోయింది.
సిగ్మా టేకింగ్ చూశాక జేసన్ సంజయ్ సీరియస్ గా సీనియర్ల దగ్గర శిక్షణ లేదా సలహాలు తీసుకోవాలి. ఇలా నాకు తోచింది తీస్తాను అంటే కుదరదు. త్రివిక్రమ్ శ్రీనివాస్, రవితేజ లాంటి వాళ్ళు తమ పిల్లలను స్టార్ డైరెక్టర్ల దగ్గర ట్రైనింగ్ కు పంపడానికి కారణం ఇదే. కానీ జేసన్ నేరుగా మెగా ఫోన్ పట్టుకున్నాడు. మాటల్లో ఉన్నంత కాన్ఫిడెన్స్ తెరమీద చేతల్లో లేదు. ఇది అర్జెంట్ గా మార్చుకోవాలి. లేదూ ఈ రిస్క్ ఎందుకనుకుంటే హీరో అయిపోవాలి. ఎస్ అంటే చాలు ప్రొడ్యూసర్లు ఇంటి ముందు క్యూ కడతారు.
This post was last modified on October 4, 2026 4:32 pm
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…