Movie News

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే ఉన్నాయి. కానీ ఆ అంచ‌నాల‌ను క‌నీస స్థాయిలో కూడా అందుకోలేక‌పోయిందా సినిమా. ఇంత‌కుముందు సుమంత్‌తో సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం తీసిన సంతోష్ జాగ‌ర్ల‌పూడినే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశాడు. ఈ రెండు సినిమాల క‌థ‌లు చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటాయి.

దీనికి తోడు మ‌హేంద్ర‌గిరి వారాహికి మురారి మూవీతోనూ పోలిక ఉంటుంది. దేవుడి శాపం వ‌ల్ల‌ ఒక వంశానికి చెందిన‌ మ‌గ‌వాళ్లు ఒక వ‌య‌సు రాగానే చ‌నిపోవ‌డం అనే కాన్సెప్ట్ మురారిలో చూసిందే. ఆల్రెడీ చూసిన పాయింటే అయినా.. దాన్ని స‌రిగ్గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే సినిమా క్లిక్ అయ్యేదేమో. కానీ అలా జ‌ర‌క్క‌పోవ‌డంతో మ‌హేంద్ర‌గిరి వారాహి ప్రేక్షకుల తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది.

ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వ‌చ్చింది. ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌లో సినిమా చూసిన వాళ్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఒక నెటిజ‌న్.. మురారి సినిమా చూసుకోవ‌చ్చు క‌దా అంటూ డైరెక్ట‌ర్‌ను తిడుతూ పోస్టు పెట్టాడు. దానికి సంతోష్ జాగ‌ర్ల‌పూడి స్పందించ‌డం విశేషం. మురారి చూసే తీశానంటూ అత‌ను రిప్లై ఇచ్చాడు. దీని మీద నెటిజ‌న్లు మ‌ళ్లీ కౌంట‌ర్లు వేస్తున్నారు. సేమ్ కాన్సెప్ట్‌తో మ‌ళ్లీ సినిమా ఎలా తీశావు అంటూ అత‌డిని విమ‌ర్శిస్తున్నారు.

మ‌హేంద్ర‌గిరి వారాహిలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ కూడా ఒక క్యామియో చేశాడు. కానీ అది పండిందా అంటే ఠక్కున అవునని చెప్పలేం. క‌మెడియ‌న్లు బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌ల‌ను ఇమేజ్‌కు భిన్న‌మైన పాత్ర‌ల్లో చూపించారు కానీ.. అది పూర్తిగా వ‌ర్క‌వుట్ కాలేదు. ట్విస్టులు అనుకున్న స్థాయిలో పేలకపోవడంతో సినిమా చివ‌రికి అసంతృప్తిని క‌లిగిస్తుంది. ఈ చిత్రాన్ని మ‌ధు కాలెపు నిర్మించాడు.

This post was last modified on October 4, 2026 9:27 pm

Share

Recent Posts

దెయ్యం సినిమాతో బ్రేక్ అందుకున్న దేవిక

ఇటీవలే విడుదలైన హారర్ మూవీ 418 బాక్సాఫీస్ వద్ద డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తోంది. టాక్ మరీ యునానిమస్ గా రాకపోయినా…

34 minutes ago

పునేఠా పార‌ద‌ర్శ‌క‌త‌కు ఇదే నిద‌ర్శ‌నం జ‌గ‌న్‌

ఏపీలో జ‌రుగుతున్న స్థానిక‌, మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ అనిల్ చంద్ర…

2 hours ago

శ్రీకాంత్‌ను ఇప్పట్లో వదిలిపెట్టేలా లేరు

ప్యారడైజ్ థియేటర్ రన్ అయిపోయి రోజులు గడిచిపోయాయి. నైజామ్ మినహాయించి మిగిలిన చోట్ల డిజాస్టర్ కావడం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇది…

2 hours ago

వంగవీటి రాధా స్పీడ్ పెంచాలి

విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మేయ‌ర్ అభ్య‌ర్థులుగా ముగ్గురు పోటీ ప‌డుతున్నారు. రాష్ట్రంలోనే ఎంతో కీల‌కంగా భావించే ఈ స్థానం..…

2 hours ago

మాట నిలబెట్టుకుంటే అదే పెద్ద కానుక

నిన్న విడుదలైన ఫౌజీ ఇంట్రో టీజర్ మీద సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. లాజిక్స్ ప్రశ్నిస్తూ…

3 hours ago

సూపర్ హిట్ రణబాలి అని పిలవండి

విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమా ర‌ణ‌బాలికి ఆరంభంలో ఎంత నెగెటివ్ టాక్ వ‌చ్చిందో తెలిసిందే. రివ్యూలు కూడా చాలా వ‌ర‌కు…

4 hours ago