ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్వాంటం కంప్యూటర్‌ను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. అమరావతి నుంచే దేశవ్యాప్తంగా క్వాంటం కంప్యూటర్ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. స్వర్ణాంధ్ర విజన్ పేరుతో నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అమరావతిని అగ్రగామి నగరంగా తీర్చిదిద్దుతున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ కంటే కూడా మెరుగైన నగరంగా అమరావతి ఉంటుందన్నారు.
ఒకప్పుడు టెలికాం రంగం పరిమితం సేవలు మాత్రమే అందించేందన్న ముఖ్యమంత్రి.. ఇప్పుడు అన్ని రకాల సేవలను కూడా టెలికాం రంగం అందిస్తోందన్నారు. అలానే.. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటర్ సైతం.. మరిన్ని సేవలను ప్రజలకు చేరువ చేయనుందని వివరించారు. ఐటీ నిపుణులు సైతం అమరావతివైపు చూసే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ ఐటీ నిపుణులు సైతం అమరావతివైపు చూస్తున్నారని, వారికి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. కొత్త ఆవిష్కరణలను తాను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నానని.. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ కూడా అలాంటిదేనని చెప్పారు.
వాటర్ గ్రిడ్..
దేశంలో విద్యుత్ గ్రిడ్ ఉన్నట్టుగానే వాటర్ గ్రిడ్ కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఐదు నదులను కలుపుతూ.. ఈ గ్రిడ్‌ను ఏర్పా టు చేయడం ద్వారా అన్నిరాష్ట్రాలకు సాగు, తాగు నీటికికొరత లేకుండా నిరంతరం అందించవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని తాను ప్రధానికి సైతం వివరించానన్నారు. సరైన నాయకుడు ఈ దేశానికి ప్రధానిగా ఉన్నారని, ఆయన తీసుకునే నిర్ణయాలు దేశానికి మేలు చేస్తున్నాయని కొనియాడారు. వాటర్ గ్రిడ్ విషయంలో కూడా ప్రధాని మంచి నిర్ణయం తీసుకుంటే.. నీటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయన్నారు.
ఒకప్పుడు హైదరాబాద్‌ను అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పారు. అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఆర్థిక వనరుగా మారిందన్నారు. అలానే అమరావతి కూడా ఏపీకి ఆర్థిక వనరుగా మారుతుందని చెప్పారు. సెల్ఫ్ సస్టెయినబుల్ క్యాపిటల్ గా దేశంలోనే అమరావతి ముందుంటుందన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే అమరావతికిప్రపంచ స్థాయి పెట్టుబడులు వస్తున్నాయని.. 2028 నాటికి తొలిదశ పనులు పూర్తి చేసి అమరావతిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రాజధాని ప్రక్రియ నిరంతరం సాగుతుందన్నారు.
This post was last modified on October 4, 2026 8:59 pm
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…