Political News

అవ‌హేళ‌న చేసి… అడ్ర‌స్ లేకుండా పోయారు!

“ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఈ ప్రాంతానికి ఎర్రబస్సు రాదన్నారు..ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అడ్డుపడ్డారు…అన్నీ అధిగమించి అద్భుతమైన ఎయిర్ పోర్టు నిర్మించాం. విమానశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి పేరు పెట్టుకున్నాం..ఆయన పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది“ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప‌రోక్షంగా వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నూత‌నంగా నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వంలో ఆయ‌న మాట్లాడారు.

భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములిచ్చిన రైతులు ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చెప్పారు. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని నరేంద్రమోడీ నాయకత్వంలో తాను, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చామ‌ని.. దాన్ని నిలబెట్టుకున్నామ‌ని చెప్పారు. “భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారం. ఎర్రబస్సు రాదన్నారు.. కానీ ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వారు.. అడ్రస్ లేకుండా పోయారు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు. ఉత్తరాంధ్ర వాసి జీఎమ్మార్ ఈ ఎయిర్ పోర్టు నిర్మించారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి తొలి అడుగులు వేయించిన అశోక్ గడపతి రాజు, ప్రస్తుత విమానయాన శాఖ  మంత్రి రామ్మోహన్నాయుడుది ఉత్తరాంధ్ర.“ అని పేర్కొన్నారు.

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు సెంటిమెంట్ నిలబెట్టింది ప్రధాని నరేంద్ర మోడీయేన‌ని చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం, రాజధాని అమరావతికి నిధులు ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోడీనేన‌న్నారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం.. ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామ‌న్నారు. “2028 నాటికి అమరావతి మొదటి దశ పనులను పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం. ఓ పక్క సముద్రం… మరొపక్క కొండల మధ్య విమాన ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది. అల్లూరి ఎయిర్ పోర్టులో అడుగడుగునా తెలుగు సంప్రదాయం ఉట్టిపడుతోంది.విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మిస్తున్నాం.“ అని బాబు వివ‌రించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టుతో తెలంగాణ దశ దిశ మారిందన్న చంద్ర‌బాబు.. భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుందని చెప్పారు. “భోగాపురం ఎయిర్ పోర్టుకు నాడు కొబ్బరికాయ కొట్టాం.. ఇప్పుడు గుమ్మడి కాయ కట్టాం. 2 ఏళ్లలో ప్రధాని మోడీ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులు.. రూ.6.13 లక్షల పెట్టుబడులు… ఇవి పూర్తి అయితే 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. వచ్చే 3 ఏళ్లల్లో రూ.2784 కోట్లతో 8 ప్రధాన సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. 65 ఏళ్లుగా పెండింగులో ఉన్న నేరడి బ్యారేజీకి క్లియరెన్స్ వచ్చింది.ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని అనకాపల్లికి తెస్తాం. వంశధార-గోదావరి అనుసంధానం చేస్తాం. ఉత్తరాంధ్ర టూరిజం, ఫార్మా, జాతీయ రహదారులు, రేర్ ఎర్త్ మినరల్స్.. పుణ్యక్షేత్రాలు వంటివి ఉన్నాయి.“ అని వివ‌రించారు.

This post was last modified on August 1, 2026 11:44 pm

Share

Recent Posts

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

45 minutes ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

47 minutes ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

2 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

3 hours ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

3 hours ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

4 hours ago